ఇటీవలే ప్రేమలు సినిమాని మహేష్ బాబు చూశాడు. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి తన స్వంత ఏఎంబి మల్టీప్లెక్సులో ఎంజాయ్ చేశాడు. అక్కడితో ఆగలేదు. ప్రత్యేకంగా ట్వీట్ వేసి మరీ ప్రశంసలు కురిపించాడు. దీన్ని భూతద్ధంలో చూస్తున్న వాళ్ళు లేకపోలేదు. అదే రోజు విడుదలైన గామిని ఎందుకు ఇదే స్థాయిలో ప్రమోట్ చేయలేదన్నది కొందరు మూవీ లవర్స్ ప్రశ్న. ఇది కొంత వరకు సబబే కానీ మహేష్ బాబు టాలీవుడ్ మొత్తానికి బ్రాండ్ అంబాసడర్ కాదు. వ్యక్తిగా తనకు ఇష్టమైన నచ్చిన పనులు చేసే స్వాతంత్రం ఉండకుండా ఎక్కడికి పోతుంది. సినిమా ఛాయస్ లో అయినా సరే.
అలాంటప్పుడు ప్రేమలుకి సపోర్ట్ చేశాడు కాబట్టి గామికి కూడా చేయాలంటే ఎలా. ఇక్కడో లాజిక్ మిస్ కాకూడదు. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న వేళ ఎస్ఎస్ కార్తికేయ ప్రేమలు హక్కులు కొని తెలుగులో రిలీజ్ చేశాడు. ఆ చనువుతో చూసి ఫీడ్ బ్యాక్ ఇమ్మని అడిగి ఉంటాడు. అందులో తప్పేం లేదు. మహేష్ చేసింది కూడా అదే. గతంలో మేం ఫేమస్ కి ఇలా చేసినప్పుడు చిన్న పాటి రచ్చ జరిగింది. ఛాయ్ బిస్కెట్ వాళ్ళతో ఉన్న అనుబంధం దృష్ట్యా దానికీ ట్వీట్లు పెట్టాడు. ఇలా స్టార్ హీరోల ప్రతి చర్య వెనుక ఖచ్చితమైన కారణం ఉంటుంది.
నిజంగానే ప్రేమలు బాగుంది. ఇది ఆడియన్స్ ఫీడ్ బ్యాక్. అలా అని గామి బాలేదని కాదుగా అర్థం. అలా అయితే మూడు రోజులకు ఇరవై కోట్ల గ్రాస్ ఎలా వసూలు చేస్తుంది. ఎంత హడావిడి చేసినా ప్రేమలు ఇంకా పది కోట్ల మార్కు కాదు కదా ఇంకా సగం కూడా అందుకోలేదు ఇప్పుడిప్పుడే పికప్ అవుతోంది. ఈ వీకెండ్ లో ఊపందుకునేలా ఉంది. మళయాలం డబ్బింగ్ కాబట్టి మన జనాలు కనెక్ట్ అయ్యేందుకు టైం పడుతోంది. మహేష్ బాబు, రాజమౌళిలు ప్రత్యేకంగా చెప్పాక వసూళ్లు ఊపందుకున్నాయి. సోషల్ మీడియా కాలంలో ఇలాంటివి అలవాటైపోయాయి కాబట్టి మాములేనని వదిలేయాల్సిందే.
This post was last modified on March 13, 2024 10:06 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…