ఒక పట్టాన ఏ సినిమానూ ఓకే చేయని హీరోగా అల్లు అర్జున్‌కు పేరుంది. ఒకసారి ఒక సినిమా మీదే ఫోకస్ చేసే బన్నీ.. కొత్త కథలు విన్నా వెంటనే ఓకే చేయడు. చాలామంది దర్శకులు తనతో కొన్ని నెలలు కథా చర్చలు జరిపి.. ఆ తర్వాత సైడ్ అయిపోయిన వాళ్లే.
అందుకే బన్నీ ఓ సినిమాను లాక్ చేసినట్లు వార్త వచ్చినా జనం అంత సులువుగా నమ్మరు. ‘పుష్ప’ తర్వాత బన్నీ చేసే సినిమా గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్‌తో సినిమా ఓకే అయినా.. అది వెంటనే సెట్స్ మీదికి వెళ్లట్లేదు. మధ్యలో బన్నీ వేరే సినిమా చేస్తాడని అంటున్నారు.
ఆ అవకాశం ఎవరికి దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇప్పుడు బన్నీని ఓ సినిమాకు లాక్ చేసినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి.
బన్నీతో తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమా చేస్తాడని ఎప్పట్నుంచో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆ సినిమా ఓకే అయినట్లు సమాచారం. సన్ పిక్చర్స్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించబోతోందట. ఈ సినిమాకు బన్నీ ఏకంగా రూ.120 కోట్ల పారితోషకం పుచ్చుకోబోతున్నాడట.
‘పుష్ఫ’తో బన్నీ ఇమేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ పెరిగిపోయాయి. అతడికి వంద కోట్లు ఇచ్చినా తక్కువేం కాదని అంటున్నారు ట్రేడ్ పండిట్లు. సన్ పిక్చర్స్ అంకతుమించి ఆఫర్ చేసి బన్నీని సినిమాకు లాక్ చేసిందట.
అట్లీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే తీస్తాడు కానీ.. అతడికి ఇప్పటిదాకా అపజయమే లేదు. చివరగా ‘జవాన్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు అట్లీ. ఈసారి బన్నీతోనూ పక్కా కమర్షియల్ మూవీనే ప్లాన్ చేస్తున్నాడట ఈ తమిళ దర్శకుడు.
This post was last modified on March 13, 2024 4:19 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…