కొందరు హీరోయిన్లను చూస్తే పెద్ద రేంజికి వెళ్లే లక్షణాలు ఉన్న వారిలా కనిపిస్తారు. కానీ మంచి అవకాశాలు వచ్చినా.. కాలం కలిసి రాక ఫేడవుట్ అయిపోతుంటారు. అలాంటి హీరోయినే మీరా చోప్రా. తెలుగులో పవర్ పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరో సరసన ఆమె కథానాయికగా పరిచయం అయింది.
పవన్‌తో ఆమె ‘బంగారం’ అనే పెద్ద సినిమా చేసిన సంగతి తెలిసిందే. కానీ అది డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ‘వాన’ అనే మూవీ చేస్తే అదీ నిరాశపరిచింది. ఆ తర్వాత నితిన్ సరసన ‘మారో’ అనే సినిమా చేస్తే అది చాలా ఆలస్యం అయి.. చివరికి రిలీజై డిజాస్టర్ అనిపించుకుంది. నాగార్జునతో కలిసి చేసిన ‘గ్రీకు వీరుడు’ ఫలితం కూడా తెలిసిందే. దీంతో మీరా కెరీర్ ముందుకు కదల్లేదు. తమిళంలోనూ కొన్ని పేరున్న సినిమాలే చేసినా మీరాకు కలిసి రాలేదు. హిందీలోనూ కథానాయికగా అనుకున్న స్థాయికి వెళ్లలేకపోయింది.
ఐతే సినిమాలతో పాటు కొన్ని వివాదాలతో మీరా అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇప్పుడామె పెళ్లి వార్తతో మీడియాలోకి వచ్చింది. మీరా కొంత కాలంగా డేట్ చేస్తున్న వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌ను పెళ్లి చేసుకుంది. జైపూర్‌లో కొందరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంది మీరా. చివరగా గత ఏడాది వచ్చిన ‘సఫేద్’ అనే హిందీ మూవీలో మెరిసింది మీరా. సినిమాలతో పాటు కొన్ని టీవీ షోలు కూడా చేసిన మీరాకు మోడలింగ్‌లోనూ అనుభవం ఉంది.
చివరగా తెలుగు ప్రేక్షకులు ఆమెను తలుచుకుంది ఎన్టీఆర్ అభిమానులతో సోషల్ మీడియా గొడవ వల్లే. ఓ చిట్ చాట్ సందర్భంగా ఎన్టీఆర్ గురించి చెప్పమంటే అతనెవరో తనకు తెలియదంది మీరా. దీంతో ఆమెను తారక్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె వాళ్ల మీద పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ కూడా ఇవ్వడం గమనార్హం.
This post was last modified on March 13, 2024 4:20 pm
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…