కెరీర్ మొదలుపెట్టి పధ్నాలుగు సంవత్సరాలవుతున్నా సందీప్ కిషన్ ఇంకా టైర్ 2 స్టార్ హీరోల రేంజ్ కి చేరుకోలేకపోయాడు. హిట్లు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించుకుంటే సమాధానం సులభంగా చెప్పుకునేంత సింగల్ డిజిట్ లోనే ఉన్నాయి. క్రమంగా సరైన దారిలో వెళ్తున్న సూచనలు మెరుగుపడుతున్నాయి. కథలు, దర్శకుల ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఫలితాలు ఇస్తున్నాయి. ఊరిపేరు భైరవకోన పెద్దగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ కాకపోయినా కొంత మిక్స్డ్ టాక్ తట్టుకుని మరీ కమర్షియల్ గా మంచి వసూళ్లు తెచ్చింది. ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గ హిట్టు ఇదొక్కటే.
రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ చిరంజీవి కోసం రాసుకున్న కథని ఆయన వద్దనుకోవడంతో ఇప్పుడా స్థానంలో రావు రమేష్ ని పెట్టి, యూత్ హీరో పాత్రకు సందీప్ కిషన్ ని ఎంపిక చేసుకోవడం చూస్తే దర్శకుల ఛాయస్ సందీప్ వైపు ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది టీమ్ చెప్పింది కాదు కానీ మారిన పరిణామాలను విశ్లేషించుకుంటే అర్థమైపోతుంది. దీని కోసమే ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ కొట్టినా ఏడాదికి పైగా వేచి చూసిన దర్శకుడు త్రినాథ రావు నక్కిన ఫైనల్ గా సందీప్ తో చేతులు కలిపాడు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న రాయన్ లో ఆల్రెడీ కీలక పాత్ర దక్కింది.
ఇవి కాకుండా ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ తో ఒక సినిమాతో పాటు ప్రాజెక్ట్ జెడ్ సీక్వెల్ ని అఫీషియల్ గా లాక్ చేసుకున్నాడు. ఇవన్నీ సందీప్ కిషన్ డైరీని బిజీగా మార్చడమే కాదు క్వాలిటీతో నింపేస్తున్నాయి. హిట్ అయితే మార్కెట్ స్థాయి పెరుగుతుంది. ముప్పై సినిమాల వయసే ఉన్న నాని, నితిన్ రేంజ్ లో సందీప్ కిషన్ కి ఇంకా పునాది బలపడాల్సి ఉంది. ఎలాగూ విభిన్న కథలు, డిఫరెంట్ జానర్లు వస్తున్నాయి. గల్లీ రౌడీ లాంటి మాస్ ఉచ్చులో పడకుండా ఇప్పుడులాగే కమర్షియల్ కు దూరం ఉంటే కెరీర్ స్పాన్ పెరిగి ఇంకా మంచి అవకాశాలు వస్తాయి.
This post was last modified on March 13, 2024 9:44 am
వైసీపీకి దశ-దిశ కొరవడిందా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం…
మంచు విష్ణు హీరోగా తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఎట్టకేలకు విడుదల తేదీని…
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ…
ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి…
2012 లో ఉప్పెన మూవీ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి..శ్యామ్ సింగరాయ్,. బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్స్…
భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా..…