మీరా మిథున్.. కొన్ని నెలలుగా కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్న పేరు. సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలు చేయడం, ‘బిగ్ బాస్’ మూడో సీజన్లో పార్టిసిపెంట్‌గా వెళ్లడం ద్వారా ఈమె లైమ్ లై్లోకి వచ్చింది. ఐతే అలా వచ్చిన పాపులారిటీ కంటే.. కోలీవుడ్ సెలబ్రెటీల మీద ఆమె సంచలన ఆరోపణల ద్వారానే ఆమెకు మీడియాలో వచ్చిన కవరేజీతోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. దాదాపుగా మన శ్రీరెడ్డి తరహాలో ఆమె కోలీవుడ్ బడా బాబులను టార్గెట్ చేస్తూ వచ్చింది. సూర్య, జ్యోతిక, విజయ్, కమల్ హాసన్, విశాల్.. ఇంకా చాలామందిని ఆమె టార్గెట్ చేసింది. రకరకాల ఆరోపణలు చేసింది. ఐతే ఈ ఆరోపణలు అంత సహేతుంగా అనిపించకపోవడం, వార్తల్లో నిలవడం కోసమే ఆమె పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తున్నట్లు కనిపించడంతో ఒక దశ దాటాక అందరూ ఆమెను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు.
నెమ్మదిగా మీడియా కూడా ఆమెను తేలిగ్గా తీసుకుంది. ఇలాంటి సమయంలో మళ్లీ మీరా మిథున్ వార్తల్లోకి వచ్చింది. తాను చనిపోయినట్లుగా తన ట్విట్టర్ అకౌంట్లోనే ఆమె పోస్ట్ పెట్టడం ద్వారా సంచలనం రేపింది. ‘‘మీరా మిథున్ మృతి చెందింది. పోస్టు మార్టం జరుగుతోంది. విచారణ మొదలైంది. రెస్ట్ ఇన్ పీస్’’ అని ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో ఫాలోవర్లలో అలజడి మొదలైంది. కొందరు ఈ పోస్ట్ అటెన్షన్ కోసం పెట్టిందే అయి ఉంటుందని లైట్ తీసుకున్నారు. ఇంకొందరు మీరాకు ఏమైందని ఆరా తీశారు. ఇంకా దీనిపై మీరా నుంచి స్పందన లేదు. బహుశా తన ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని అంటుందా.. లేక ఇంకేమైనా వివరణ ఇస్తుందా అన్నది చూడాలి. కొంత కాలంగా మీరా వ్యవహారం చూస్తే ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఆమెకు చికిత్స అవసరమని మానసిక నిపుణులు అంటున్నారు.
This post was last modified on September 12, 2020 6:39 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…