బిగ్‍బాస్ లేటెస్ట్ సీజన్ ఇంకా ఆరంభ దశలోనే వుంది కానీ డ్రామాకి అయితే లోటుండడం లేదు. జనాలకు బాగా తెలిసిన వారు చాలా తక్కువ మంది వున్నా కానీ వివిధ వ్యక్తిత్వాలున్న వాళ్లు హౌస్‍లోకి వెళ్లడంతో ఇంతవరకు గేమ్ రసపట్టుకి చేరుకోకపోయినా ఆడియన్స్కి కాలక్షేపమయితే అయిపోతోంది. ప్రతి సీజన్‍లానే ఈసారి కూడా బిగ్‍బాస్‍ని కాచి వడపోసిన క్యారెక్టరొకటి హౌస్‍లోకి వెళ్లింది.
సింగర్ కమ్ యాక్టర్ నోయెల్ షాన్ బిగ్‍బాస్ సీజన్లన్నీ చూసేసి అవసరమైన దానికంటే ఎక్కువ ఇన్‍ఫర్మేషన్ బుర్రలో ఫీడ్ చేసేసుకున్నాడు. దీంతో అక్కడ ఏమి జరిగినా, ఎవరు ఏమి మాట్లాడినా అది గేమే అనుకుంటున్నాడు. తాను అనుకోవడమే కాకుండా మిగతా వాళ్లను కూడా నమ్మించేస్తున్నాడు. ఆ కన్‍ఫ్యూజన్‍లో లాస్య, కళ్యాణి, అభిజీత్, హారిక లాంటి వాళ్లు ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిలో వెర్రి వెంగళాయ్‍లు అయిపోయారు.
ఇదిలా వుంటే కుర్రాళ్లకు తెగ నచ్చేసిన దివి (మహర్షి ఫేమ్) మొదటి రెండు రోజులు కామ్‍గా వున్నా సైలెంట్‍గా అన్నీ గమనిస్తున్నానని, అలాగే తనను ఎవరూ అంత ఈజీగా ఇన్‍ఫ్లుయన్స్ చేయలేరని చాటుకుని మరింతమంది అభిమానుల్ని సంపాదించుకుంది.
దివికి పెరుగుతోన్న ఫాన్ బేస్ చూసి బిగ్‍బాస్ ఎడిటర్లు ఆమెను కవర్ చేయడం మొదలు పెట్టారు. అలాగే గంగవ్వ తన పంచ్‍లతో, సూర్యకిరణ్ తన నిశిత దృష్టితో ఒక వర్గం వారి అభిమానాన్ని చూరగొంటున్నారు.
This post was last modified on September 12, 2020 9:49 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…