గోపీచంద్ చివరి సూపర్ హిట్ ఏదంటే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం కానీ తన మీద ప్రేక్షకుల్లో ఉన్న సదభిప్రాయం, మాస్ లో ఉన్న పట్టు తగ్గలేదని భీమా ఓపెనింగ్స్ నిరూపించాయి. భారీగా కాదు కానీ గత డిజాస్టర్లను పోల్చుకుని చూసుకుంటే కలెక్షన్లు బాగానే నమోదయ్యాయి. నిన్న బిసి సెంటర్లలో చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ టాక్. అలా అని బొమ్మ సక్సెస్ అయ్యిందని కాదు. చూసిన ఆడియన్స్ పెదవి విరిచారు. రివ్యూలు పాజిటివ్ గా రాలేదు. అభిమానులు సైతం తమ హీరో మళ్ళీ రొటీన్ రూట్ లోనే నిరాశ పరిచాడని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒకవేళ భీమా కనక సరైన మాస్ ఎలిమెంట్స్ తో వచ్చి ఉంటే శివరాత్రికి విజేతగా నిలిచేది. గామి విన్నర్ ముద్ర వేయించుకున్నా అది అన్ని వర్గాలను చేరువ కాలేకపోతోంది. ముఖ్యంగా చిన్న సెంటర్లలో జనాలకు అంతగా కనెక్ట్ కాలేదు. ఈ గ్యాప్ భీమాకు కలిసి వచ్చేది. దర్శకుడు హర్షని అదే పనిగా కన్నడ నుంచి తీసుకొచ్చినందుకు ఇదా ఫలితమంటూ ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. బాలకృష్ణ లాంటి స్టార్లే ఎంత మాస్ కోసం చేసినా అఖండ, భగవంత్ కేసరి లాంటి సినిమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని బ్లాక్ బస్టర్లు సాధిస్తున్నారు. అలాంటిది గోపీచంద్ లాంటి వాళ్ళు ఇంకా కేర్ తీసుకోవాలి.
లెక్కల సంగతి తర్వాత తేలుతుంది కానీ టీమ్ ఘనంగా చెప్పుకున్న రేంజ్ లో భీమా పెర్ఫార్మ్ చేసే సూచనలు క్రమంగా తగ్గిపోయేలా ఉన్నాయి. గామి గట్టి పోటీదారుగా నిలవగా, ప్రేమలుకి యూత్ మద్దతు దొరికింది. గోపిచంద్ కు మాస్ నుంచి సపోర్ట్ దక్కి ఉంటే ఖచ్చితంగా రికార్డులు నమోదు చేసే ఛాన్స్ దక్కేది. ఫైనల్ గా మిస్ అయ్యిందనే చెప్పాలి. శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్న గోపిచంద్ ఫామ్ లో లేని దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం చూస్తే కథని ఎంతగా నమ్మాడో అర్థం చేసుకోవచ్చు. తనకూ సక్సెస్ కావాల్సిన టైంలో శ్రీను వైట్ల అయినా గోపిచంద్ ని సరిగా వాడుకోవాలి.
This post was last modified on March 11, 2024 6:12 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…