మలయాళంలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన ప్రేమలు తెలుగులో అదే టైటిల్ తో మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. టాక్ బాగుంది. రివ్యూస్ పాజిటివ్ గా వచ్చాయి. కార్తికేయ హక్కులు సొంతం చేసుకోవడంతో రాజమౌళి అదే పనిగా ప్రీమియర్ చూశాడు. ఆ కారణంగానే మహేష్ బాబు తన ఏఎంబి మల్టీప్లెక్సులో ఫ్యామిలీతో కలిసి షో ఎంజాయ్ చేశాడు. ఇండస్ట్రీ ప్రముఖులు, దర్శకులు ఒక్కొక్కరుగా ట్వీట్లు వేసి మద్దతు తెలుపుతున్నారు. సోషల్ మీడియా స్పందన చూస్తే పబ్లిక్ ఎంజాయ్ చేసిన దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అంతా బాగుంటే సమస్య ఏంటనా. అక్కడికే వద్దాం. నిజానికి ఈ సినిమాకొచ్చిన రెస్పాన్స్ కి అదిరిపోయే నెంబర్స్ నమోదవ్వాలి. హౌస్ ఫుల్ బోర్డులతో వీకెండ్ లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొనాలి. కానీ దానికి భిన్నంగా ప్రేమలు పరుగు నెమ్మదిగానే ఉంది. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేవని బయ్యర్స్ టాక్. నగరాలు, జిల్లా కేంద్రాలు నిన్న ఆదివారం ఫుల్ నుంచి డీసెంట్ మధ్యలో మంచి ఆక్యుపెన్సీ నమోదు కాగా మిగిలిన చోట్ల మాత్రం బ్యాడ్ టాక్ వచ్చిన భీమా కంటే వెనుకబడిందని అంటున్నారు. బాగుందనిపించుకున్న సినిమాకు ఇలా జరగడం విచిత్రం.
మన ఆడియన్స్ ఎందుకు ప్రేమలు భారీగా రిసీవ్ చేసుకోలేకపోతున్నారంటే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. మనం ఇలాంటి రామ్ కామ్ లు క్రమం తప్పకుండా చూస్తూనే ఉంటాం. నువ్వే కావాలి, హ్యాపీ డేస్ జమానా నుంచి ఇప్పటిదాకా టాలీవుడ్ కు ఈ జానర్ కొత్త కాదు. ఆ మాటకొస్తే జంధ్యాల గారి రెండుజెళ్ళ సీత నుంచే ఉంది. అందుకే ప్రేమలు ఎంత ఫ్రెష్ గా ఉన్నా పూర్తి స్థాయిలో తెలుగు జనాలకు రీచ్ కావడం లేదని అర్థమవుతోంది. థియేట్రికల్ బిజినెస్ ఓన్ రిలీజ్ తో రెండు కోట్లలోపే చేయడంతో బ్రేక్ ఈవెన్ తో పాటు లాభాలు ఖాయమే కానీ ఇంకా పెద్ద స్థాయిలో మేజిక్ జరగాల్సింది.
This post was last modified on March 11, 2024 1:52 pm
టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…
కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసన…
ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…
తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలే హవా చూపించాయి.…
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…