Movie News

జాక్ పాట్ కొట్టనున్న మృణాల్ ఠాకూర్

టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు సినిమాలతోనే బ్లాక్ బస్టర్లు అందుకున్న మృణాల్ ఠాకూర్ అవకాశాల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం తనకు మేలే చేస్తోంది. సీతారామం తర్వాత హాయ్ నాన్నలో పాప తల్లిగా నటించినా దాని ప్రభావం ఆఫర్ల మీద పడలేదు సరికదా పెర్ఫార్మన్స్ పరంగా ఇంకో కోణాన్ని కొత్తగా పరిచయం చేసింది. అందులోనూ దుల్కర్ సల్మాన్, నాని లాంటి టాలెంటెడ్ హీరోల సరసన జోడి కట్టడం చాలా ప్లస్ అయ్యింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో భార్యగా మంచి స్కోప్ ఉన్న పాత్రనే దర్శకుడు పరశురామ్ డిజైన్ చేశాడట.

ఇదిలా ఉండగా దర్శకుడు హను రాఘవపూడి హీరో ప్రభాస్ కాంబోలో తెరకెక్కబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీలో మృణాల్ ని తీసుకునే ఆలోచన జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. సీతారామంలో ఆమెను చాలా బాగా చూపించిన హను మరోసారి అలాంటి క్యారెక్టర్ ప్లాన్ చేశారని తెలిసింది. కథ లాక్ అయిపోయి ఫైనల్ స్క్రిప్ట్ స్టేజిలో ఉన్న ఈ పీరియాడిక్ డ్రామాకు ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. విశాల్ భరద్వాజ్ ట్యూన్లను ఓకే చేసుకునే పనిలో టీమ్ బిజీగా ఉంది. షూటింగ్ కి ఇంకా చాలా టైం ఉండటంతో ప్రీ ప్రొడక్షన్ పనులను ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటున్నారు.

ఇది కనక లాక్ అయితే మృణాల్ ఠాకూర్ సుడి తిరిగినట్టే. చిరంజీవి విశ్వంభరలోనూ తీసుకున్నారనే టాక్ ఉంది కానీ యూనిట్ నుంచి అధికారిక కన్ఫర్మేషన్ రావడం లేదు. ఫోటోలు కూడా చెల్లెల్లుగా నటిస్తున్న హీరోయిన్లవి లీకవుతున్నాయి కానీ వాటిలో ఎక్కడ మృణాల్ లేదు. ఎటొచ్చి బాలీవుడ్ లో సెటిలవుదామని చూస్తున్న ఈమెకు కెరీర్ పరంగా మంచి బ్రేక్స్ తెలుగులోనే దక్కడంతో క్రమంగా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యే ఆలోచన కూడా చేస్తోందట. గ్లామర్ షో చేయడానికి సిద్ధంగా ఉన్నా సీతారామం దెబ్బకు మన దర్శకులు ఆమెను హోమ్లీగా చూపించేందుకే ఇష్టపడటం విశేషం.

This post was last modified on March 11, 2024 3:22 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

16 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

23 minutes ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

1 hour ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago