స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ క్రేజీ మూవీ టిల్లు స్క్వేర్ విడుదల ఎంతో దూరంలో లేదు. ఈ రోజు మినహాయిస్తే కేవలం 18 రోజులు మాత్రమే బ్యాలన్స్. మార్చి 29 రిలీజ్ ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. ఎలాంటి మార్పు ఉండబోవడం లేదని టీమ్ చెబుతోంది. అయితే ఇంకా హడావిడి మొదలు కాకపోవడం ఫ్యాన్స్ లో అనుమానాలు రేపుతోంది. సాధారణంగా ప్రమోషన్ల విషయంలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ నెల రోజుల ముందు నుంచే తన రాక గురించి సౌండ్ చేసే సిద్దు సైలెంట్ గా ఉండటం వాళ్లకు అంతు చిక్కడం లేదు. కొంపతీసి వాయిదా ఉందాని ఆందోళన పడుతున్న వైనం కనిపిస్తోంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒత్తిడిలో జరుగుతున్నందు వల్లే దర్శకుడు మల్లిక్ రామ్, హీరో సిద్దులు బిజీగా ఉన్నారట. దీని వల్ల ఇప్పటికిప్పుడు పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారని ఇన్ సైడ్ టాక్. ఫిబ్రవరి 18 తర్వాత సితార ట్విట్టర్ హ్యాండిల్ లో టిల్లు స్క్వేర్ కి సంబంధించి ఎలాంటి సాలిడ్ అప్డేట్ లేదు. పోనీ కౌంట్ డౌన్ పోస్టర్స్ లాంటివి వదిలారా అంటే అవీ లేవు. అసలే ఆ వారంలో పోటీ తీవ్రంగా ఉంది. పృథ్విరాజ్ సుకుమారన్ ఆడు జీవితం, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ పోటీలో ఉన్నాయి. వారం తిరక్కుండా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తుంది.
సో వీలైనంత త్వరగా సిద్ధూ జొన్నలగడ్డ కెమెరా ముందుకొచ్చి కబుర్లు పంచుకోవడం మొదలుపెట్టాలి. రెండేళ్ల క్రితం వచ్చిన సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ డీజే టిల్లుకి కొనసాగింపుగా వస్తున్న టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ భారీ ఆకర్షణగా నిలుస్తోంది. అయితే నేపధ్య సంగీతం సమకూరుస్తున్న తమన్ కి ఇంకా ఫైనల్ కాపీ ఇవ్వలేదని, ఈ వారంలో ఇచ్చేస్తే బీజీఎమ్ కు సంబంధించిన ముఖ్యమైన పని అయిపోతుందని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. బిజినెస్ మాత్రం క్రేజీగా జరుగుతోంది. మొదటి భాగం కన్నా నాలుగు రెట్లు అధిక డిమాండ్ ఉన్నట్టు ట్రేడ్ రిపోర్ట్.
This post was last modified on March 10, 2024 9:48 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…