మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో, క్రేజీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే శివరాత్రి పండగ సందర్భంగా విడుదల చేశారు. అయితే కంటెంట్ రేంజ్ కు తగ్గట్టు కిక్ ఇవ్వలేదని, అనుకున్న స్థాయిలో ట్రెండింగ్ కాలేదని అభిమానులు ఫీలవుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. విష్ణుని పూర్తిగా రివీల్ చేయకపోవడం, ఇంత పెద్ద స్కేల్ లో రూపొందుతున్న గ్రాండియర్ కు కనీసం ఒక టీజర్ లాంటిది ఏదైనా వదలకపోవడం ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇంకొంచెం బెటర్ స్టిల్ వదిలి ఉండాల్సిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు లాంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్నారు. ఎవరు ఏ పాత్ర చేస్తున్నారనే డీటెయిల్స్ బయటికి రాలేదు కానీ క్రమంగా ఒక్కొక్కరిని పరిచయం చేసేలా ప్రమోషనల్ ప్లానింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా అందరి కళ్ళు శివుడిగా కనిపించబోయే ప్రభాస్ గురించే ఎదురు చూస్తున్నాయి. విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముందే ప్రకటించి ఆ మేరకు డేట్లు మార్చుకుంటూ ఒత్తిడి తీసుకోవడం కన్నా షూటింగ్ చివరి దశలో ప్రకటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో విష్ణు దాని గురించి ఓపెన్ కావడం లేదు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్ ఇండియా డివోషనల్ మూవీలో కన్నప్పగా విష్ణు పెద్ద రిస్కే చేస్తున్నాడు. కృష్ణంరాజు తర్వాత మళ్ళీ ఏ హీరో ఆ పాత్ర చేసేందుకు సాహసం చేయలేదు. దశాబ్దాల తర్వాత విష్ణు దానికి పూనుకున్నాడు. కొన్నేళ్ల నుంచి ఇది తన డ్రీం ప్రాజెక్టుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మంచు ఫ్యామిలీకి ప్రతిష్టాత్మక సినిమా కావడంతో ఖర్చు విషయంలో వెనుకాడటం లేదు. హనుమాన్ లాగా దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టి పడేలా చేయాలంటే మంచి పబ్లిసిటీ స్ట్రాటజీ అవసరం. స్టీఫెన్ సంగీతం సమకూరుస్తున్న కన్నప్పలో హీరోయిన్ ఎవరనేది అఫీషియల్ చేయలేదు.
This post was last modified on March 10, 2024 10:41 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…