శివరాత్రి సినిమాల్లో ఓపెనింగ్స్ పరంగా విజేత గామి అని వసూళ్ల సాక్షిగా అర్థమైపోయింది. బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుకుంటుందా లేదానేది కనీసం ఇంకో వారం రోజులు ఆగాక తేలుతుంది. ఇంత క్లిష్టమైన కాన్సెప్ట్ జనాలకు అర్థమవుతుందో లేదోనని గామి బృందం పడిన టెన్షన్ తీరినట్టే. గతంలో ప్రకటించిన ప్రకారమైతే నిజానికి మార్చి 8న గ్యాంగ్స్ అఫ్ గోదావరి రావాలి. కానీ షూటింగ్ లో ఆలస్యంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ లేట్ కావడంతో వాయిదా వేశారు. ఈ నెలలో సాధ్యం కాదు. సితార బ్యానర్ లోనే రూపొందిన టిల్లు స్క్వేర్ మార్చి 29 రిలీజ్ ఉంది కనక ఏప్రిల్ లేదా మేకి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది.
ఇప్పుడు గామి ఫలితం గ్యాంగ్స్ అఫ్ గోదావరికి కలిసి వచ్చేలా ఉంది. విశ్వక్ మీద రిస్కీ సబ్జెక్టు కమర్షియల్ గానూ వర్కౌట్ అవుతుందని తేలడంతో సహజంగానే తర్వాతి సినిమాకు ప్లస్ అవుతుంది. పైగా గ్యాంగ్స్ పక్కా మాస్ బ్యాక్ డ్రాప్. పల్లెటూరి నేపథ్యంలో జరిగే ముఠా రాజకీయాలను దర్శకుడు కృష్ణ చైతన్య చాలా ఇంటెన్స్ గా తీర్చిదిద్దినట్టు టాక్ ఉంది. ఈ షూటింగ్ లో గాయపడి విశ్వక్ సేన్ విశ్రాంతి తీసుకుంటే తిరిగి జాయినవ్వడానికి బాలయ్య ముహూర్తం పెట్టారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు,
ఇంకొద్ది రోజుల్లో రిలీజ్ డేట్ ని ప్రకటించాల్సి ఉంది. చాలా ఇంటరెస్టింగ్ లైనప్ ని సెట్ చేసుకున్న విశ్వక్ సేన్ లైలాలో ఆడ వేషంలో నటించేందుకు అంగీకారం తెలపడం హాట్ టాపిక్ గా మారింది. దాస్ కా ధమ్కీ ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా సీక్వెల్ తీస్తానని చెబుతున్న విశ్వక్ రాబోయే ఏడాది కాలం మూడు నాలుగు రిలీజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి విషయానికి వస్తే డిసెంబర్ నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ విలేజ్ డ్రామాలో అంజలి ఒక స్పెషల్ సాంగ్ చేసింది. విడుదల ఫిక్స్ అయ్యాక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తారు.
This post was last modified on March 9, 2024 9:04 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…