మహాశివరాత్రి సందర్భంగా సినీ ప్రియుల కోసం చాలా కానుకలు వచ్చాయి. అందులో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ప్రభాస్ సినిమా కల్కి నుంచి రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్కే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఒకటి వదిలారు. అది పెద్ద ట్రోల్ మెటీరియల్‌గా మారింది అప్పట్లో. కాకపోతే ఎక్కువ డ్యామేజ్ జరగకుండా వెంటనే అదిరిపోయే టీజర్ గ్లింప్స్ వదలడంతో ఆ లుక్ గురించి అందరూ మరిచిపోయారు. ఇ
క కల్కి లేటెస్ట్ లుక్ విషయానికి వస్తే.. భైరవ అని సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నేమ్ రివీల్ చేస్తూ వదిలిన లేటెస్ట్ లుక్ అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌ను ఔట్ ఫోకస్‌లో చూపిస్తున్నట్లుగా ఉన్నప్పటికీ అభిమానులు సంతోషంగానే ఉన్నారు. ఓవరాల్‌గా ప్రభాస్ గెటప్ ఆసక్తి రేకెత్తించేలా ఉంది.
ఐతే అంతా బాగుంది కానీ.. కొత్త పోస్టర్ మీద రిలీజ్ డేట్ లేకపోవడమే సందేహాలకు తావిస్తోంది. కల్కిని మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు చాన్నాళ్ల ముందే ప్రకటించారు. ఐతే మధ్యలో వాయిదా వార్తలు జోరుగా వినిపించాయి. కానీ టీం మాత్రం మే 9కే వస్తామని నొక్కి వక్కాణిస్తూ వచ్చింది ఇప్పటిదాకా. రిలీజ్ డేట్ విషయంలో అంత ధీమాగా ఉన్నపుడు లేటెస్ట్ పోస్టర్ మీద మే 9న విడుదల అని ఎందుకు వేయలేదు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పైకి ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ మే 9 విషయంలో లోలోన కాన్ఫిడెన్స్ అయితే లేదన్నది చిత్ర వర్గాల మాట.
షూటింగ్ చివరి దశకు వచ్చినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న ప్రకారం పూర్తవుతాయా లేదా అనే విషయంలో అనుమానాలున్నాయి. వేర్వేరు దేశాల్లో చేయిస్తున్న విజువల్ ఎఫెక్ట్స్ కోరుకున్న క్వాలిటీతో రావడం కీలకం. దాన్ని బట్టే రిలీజ్ డేట్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారట. అందుకే ప్రస్తుతానికి రిలీజ్ డేట్ విషయంలో మౌనం వహించడమే బెటర్ అనుకుంటున్నారట.
This post was last modified on March 8, 2024 9:33 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…