అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణతో వాల్తేరు వీరయ్యతో ఘనవిజయం అందుకున్న దర్శకుడు బాబీ చేతులు కలుపుతున్న ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మొదలైపోయాయి. దానికి తగ్గట్టే దుల్కర్ సల్మాన్ లాంటి క్యాస్టింగ్ తోడవ్వడంతో ఎలాంటి కథ చూడబోతున్నామనే యాంగ్జైటి కలగడం సహజం. ఇవాళ చిన్న శాంపిల్ ని శివరాత్రి పండగ సందర్భంగా టీమ్ విడుదల చేసింది. అల్ట్రా స్టైలిష్ గా బాలయ్య ఒక జీపులో అడవికి వేటకు రావడంతో మొదలుపెట్టి చిన్న యాక్షన్ బ్లాక్ ని రివీల్ చేశారు.
సింహం నక్కలను తరుముతోందంటే అది వార్ కాదు వేటని చెప్పే డైలాగు బాగా పేలింది. బాలయ్య వెంట తెచ్చుకున్న పెట్టెలో శత్రువులను చంపే మారణాయుధాలతో పాటు ఆయన ఫెవరెట్ మ్యాన్షన్ హౌస్ ని పెట్టడం డిఫరెంట్ గా ఉంది. మొత్తం చీకటి బ్యాక్ డ్రాప్ లో రెడ్ లైటింగ్ విజువల్స్ బాబీ కొల్లి కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఫ్యాన్స్ కోరుకున్నట్టే తమన్ నాలుగోసారి వరసగా బాలకృష్ణ సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం దక్కింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ కావడంతో తన కన్నా బెస్ట్ ఛాయస్ వేరే ఎందుకు అనుకుంటారు.
చిన్న గ్లిమ్ప్స్ అయినా మంచి వెయిట్ తీసుకొచ్చారు. విడుదల, టైటిల్ మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఏపీ ఎన్నికల దృష్ట్యా బాలకృష్ణ ఎక్కువ పర్యటనల్లో ఉంటున్నారు. రాబోయే నెల రోజులు కీలకం కావడంతో డేట్లు ఇవ్వడం కూడా కష్టమే. దసరా లేదా దీపావళికి రావొచ్చనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది కానీ ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇతర ప్యాన్ ఇండియా మూవీస్ సెప్టెంబర్, అక్టోబర్ లో ముఖ్యమైన డేట్లను లాక్ చేసుకున్న దరిమిలా ఎన్బికె 109కి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది.
This post was last modified on March 8, 2024 7:22 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…