Movie News

పాపం…ఓటిటి మార్గం వెతుక్కున్న శపథం

అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు అని పాత సినిమా పాటలో చెప్పినట్టుగా రామ్ గోపాల్ వర్మ ఎంతో గొప్పలు పోయిన వ్యూహం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టడంతో శపథంని డైరెక్ట్ ఓటిటికి ఇచ్చేశారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ సర్కారు అధికారిక ముద్ర ఉన్న ఏపీ ఫైబర్ నెట్ యాప్ ద్వారా పే పర్ వ్యూ మోడల్ లో రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. దానికి వెబ్ సిరీస్ పేరు పెట్టి ఫస్ట్ పార్ట్ కి ఆరంభం, రెండో భాగానికి అంతం అని నామకరణం చేశారు. ఫ్రీగా ఇస్తేనే కష్టమనుకుంటే ఏకంగా డబ్బులు కట్టి ఆన్ లైన్ లో చూడమంటే ప్రేక్షకులు స్పందించడం అనుమానమే.

సెన్సార్ చిక్కులతో కాలయాపన చేయడం కంటే ఇలా ఓటిటి అయితే ఏ ఇబ్బంది ఉండదని వర్మ అనుకోవడం కొంత వరకు సహేతుకంగానే ఉన్నా వ్యూహంకొచ్చిన బ్రహ్మాండమైన రెస్పాన్స్ చూసి శపథం మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవడానికి లేదని స్పష్టంగా అర్థమై ఉంటుంది. కనీసం థియేటర్ అద్దెలు కిట్టుబాటు అయ్యే రేంజ్ లో వసూళ్లు వస్తే కనీసం ఒక వారం రోజులు ఏదోలా నెట్టుకురావొచ్చు. అలా కాకుండా సింగల్ డిజిట్ లో టికెట్లు అమ్ముడుపోయి ఎడాపెడా షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇంతకన్నా ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది.

అయినా సరే వర్మ దీన్ని కూడా గర్వంగానే చెప్పుకోవడం కొసమెరుపు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి ఈ సినిమాలు ఏమైనా ఉపయోగపడతాయేమోననే లెక్కలు పూర్తిగా తప్పాయి. ఓటర్లను ప్రభావితం చేయడంలో సినిమాల పాత్ర అందులోనూ స్పూఫ్ తరహాలో తీసే వాటికి ఎలాంటి ఆదరణ ఉండదని ఇంకోసారి క్లారిటీ వచ్చింది. అయినా ఏదైనా ఆలోచింపజేసేలానో లేదా సమస్యని సీరియస్ గా చెప్పడం ద్వారానో సినిమాలు చేస్తే బాగుటుంది కానీ ఇలా వ్యక్తిగత ఎజెండాతో తీస్తూ పోతే ఇవే ఫలితాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే డబ్బులు అంటున్నారు కానీ తర్వాత ఫ్రీ అనేస్తారేమో.

This post was last modified on March 7, 2024 10:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా…

1 minute ago

రివర్స్ గేమ్ ఆడబోతున్న ఉపేంద్ర ?

అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…

11 minutes ago

ఆయ‌న సినిమా హీరో అంతే: డీజీపీ

అల్లు అర్జున్‌-పుష్ప‌-2 వివాదంపై తాజాగా తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌ స్పందించారు. ఆయ‌న సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్య‌వ‌హారంపై…

59 minutes ago

ఆస్ట్రేలియాలో 4వ ఫైట్.. టీమిండియాకు మరో షాక్!

ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…

2 hours ago

బన్నీ చేసిన తప్పు.. చేయని తప్పు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…

2 hours ago

అండర్-19 అమ్మాయిలు అదరగొట్టేశారు!

అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…

2 hours ago