టాలీవుడ్ యువ నటుడు సుహాస్‌ను చూస్తే ఇతను హీరో ఏంటి అనిపిస్తుంది. కానీ లుక్స్ పరంగా సింపుల్ అనిపించినా.. తన సినిమాల్లో కంటెంట్ మాత్రం చాలా బలంగా ఉంటుంది. కలర్ ఫొటో, ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు.. ఇలా అతను ముఖ్య పాత్రలు చేసిన సినిమాలన్నీ కూడా బలమైన కంటెంట్ ఉన్నవే. ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ అనే మరో వెరైటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సుహాస్.
అతడి సినిమాల సక్సెస్ రేట్ బాగుండడం.. సినిమా సినిమాకూ బిజినెస్ రేంజ్, సుహాస్ మీద ప్రేక్షకుల నమ్మకం పెరుగుతుండటంతో తన పారితోషకం కూడా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ప్రసన్న వదనం’ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. మీరు సినిమాకు మూడు కోట్లు తీసుకుంటున్నారట కదా అని సుహాస్‌ను అడిగితే అతను ఆసక్తికర రీతిలో బదులిచ్చాడు.
వరుసగా హిట్లు కొట్టడంతో రెమ్యూనరేషన్ పెంచారని అంటున్నారు కదా అని అడిగితే.. “ఏం పెంచొద్దా..? రోజుకు వంద రూపాయలు తీసుకునే జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి వచ్చాను. పెంచాలిగా మరి. ఏం నేను బతకొద్దా” అని సుహాస్ అన్నాడు. పారితోషకం మూడు కోట్లు అయిందట కదా అని అంటే.. పారితోషకం పెంచిన మాట వాస్తవం కానీ.. మూడు కోట్లు అనేది నిజం కాదన్నట్లుగా మాట్లాడాడు సుహాస్.
ఇక తన కెరీర్లో ఇప్పటిదాకా చేయనిది ‘ప్రసన్న వదనం’లో చేశానంటూ.. ఇందులో ఓ హీరోయిన్‌తో లిప్ టు లిప్ కిస్ సీన్ చేసినట్లు సుహాస్ వెల్లడించాడు. తన నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు వస్తున్నాయని.. అది కరెక్ట్ కాదని.. ఈ అక్టోబరు నుంచి కొంచెం స్పీడు తగ్గించి ఆచితూచి సినిమాలు చేస్తానని.. రిలీజ్‌కు, రిలీజ్‌కు మధ్య గ్యాప్ ఉండేలా చూసుకుంటానని సుహాస్ తెలిపాడు.
This post was last modified on March 7, 2024 10:40 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లుకురిపించారు. దక్షిణాది సినీ రంగానికి చిరంజీవి ఐకాన్.. అని పేర్కొన్నారు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు మాట కు తెలుగు ఓటరు ఓటెత్తాడు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ…
అరవింద్ కేజ్రీవాల్... దేశ రాజకీయాల్లో రీసౌండ్ ఇచ్చిన పేరిది. ఇటు అధికార బీజేపీతో పాటుగా అటూ నాడు అధికారంలో ఉన్న…
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్…
రెండేళ్ల కిందట తమిళంలో లవ్ టుడే అనే చిన్న సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింద తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్…