టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ ముందు సినీ రంగంతో సంబంధం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత అతను శ్రీకాంత్ మేనకోడలు రేష్మను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు గోపీకి ఇద్దరు కొడుకులు. రేష్మను పెళ్లి చేసుకునే విషయంలో అడుగు వేసింది గోపీనేనట. చాలా సిగ్గరిగా కనిపించే గోపీ తనకు తానుగా పెళ్లి ప్రపోజల్ పెట్టాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ విషయాన్ని కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోలో గోపీనే స్వయంగా వెల్లడించాడు.
“సినిమాల పరంగా నాకు అప్పటికే శ్రీకాంత్ గారితో పరిచయం ఉంది. ఆయన మేనకోడలు రేష్మ ఫొటో ఒకసారి అనుకోకుండా చూశా. తనను పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఐతే పెళ్లి గురించి ఆయనతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. చలపతిరావు గారితో ఈ విషయం చెప్పా. ‘కంగారు పడకు. నేను మాట్లాడతా’ అని ఆయనే శ్రీకాంత్ గారితో మాట్లాడి అన్నీ ముందుండి నడిపించారు. అలా మా పెళ్లి జరిగింది. పెళ్లి ఫిక్స్ అయ్యాక రేష్మ నాకు టీషర్ట్, గ్రీటింగ్ కార్డ్ గిఫ్టుగా పంపింది” అని గోపీచంద్ వెల్లడించాడు.
ఇక తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. “మా చెల్లెలు డెంటిస్ట్. బావ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వాళ్లకు ఇద్దరు కుమార్తెలు. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అమ్మ నాతోనే ఉంటుంది. నాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడికి పదేళ్లు. చిన్నవాడికి ఐదేళ్లు. నటుడిగా నా వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారో తెలయిదు. పెద్దవాడు సినిమాలు బాగా చూస్తాడు. నా సినిమాలపై విశ్లేషణలు కూడా చేస్తాడు. ఇక్కడ ఎందుకలా చేశావ్.. అక్కడ ఎందుకలా నటించావ్ అని అడుగుతుంటాడు. నేను వాళ్ల కెరీర్ల విషయంలో ఒత్తిడి చేయదలుచుకోలేదు. కానీ ఒక్కరినైనా మా నాన్న లాగా దర్శకుడిని చేయాలని ఉంది” అని గోపీ తెలిపాడు.
This post was last modified on March 7, 2024 7:25 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…