టాలీవుడ్లో తిరుగులేని విజయం సాధించిన మాస్ మసాలా సినిమాల్లో ‘విక్రమార్కుడు’ ఒకటి. రాజమౌళి కెరీర్లో ఎదుగుతున్న దశలో రవితేజ హీరోగా ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. రిలీజ్ టైంకి దీని రేంజ్ తక్కువే. కానీ ఈ సినిమా ఊహించని స్థాయి విజయాన్నందుకుంది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ.. ఇలా పలు భాషల్లో రీమేక్ చేశారు. ప్రతి చోటా సూపర్ హిట్ అయింది. ‘విక్రమార్కుడు’ సీక్వెల్ గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది.
‘విక్రమార్కుడు’ రచయిత విజయేంద్ర ప్రసాదే స్వయంగా ఈ స్క్రిప్టులో భాగం అయ్యారు. కానీ ఈ సీక్వెల్ ఎంతకీ పట్టాలెక్కడం లేదు. అందుక్కారణం.. రాజమౌళి రేంజ్ మారిపోయి ‘విక్రమార్కుడు’ లాంటి సగటు మాస్ మూవీకి సీక్వెల్ తీసే స్థితిలో లేకపోవడం. మరోవైపు హీరో రవితేజకు కూడా సీక్వెల్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడం. ఐతే ‘విక్రమార్కుడు-2’ తీయాలని తనకెంతో కోరికగా ఉందని.. ఈ సినిమా స్క్రిప్టు కోసం ఖర్చు పెట్టుకున్న నిర్మాత కేకే రాధామోహన్ అంటున్నారు.
రాధామోహన్ నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘భీమా’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన ‘విక్రమార్కుడు’ సీక్వెల్ గురించి మాట్లాడారు. ‘‘విక్రమార్కుడు సీక్వెల్ సబ్జెక్ట్ రెడీగా ఉంది. అది కేవలం నా కోసమే రూపొందింది. విక్రమార్కుడు-2 అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాం. కానీ సమస్యంతా ఆర్టిస్టుల దగ్గరే ఉంది. రవితేజ గారు ఈ సినిమా విషయంలో ఆసక్తితో లేరు. నేను ముందు ఆయన్ని ఒప్పించాలి. సంపత్ నంది ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఆసక్తితో ఉన్నాడు. నేను, సంపత్, విజయేంద్ర ప్రసాద్ గారు కలిసి ‘విక్రమార్కుడు-2’ స్క్రిప్ట్ మీద పని “చేశాం. కానీ ఇప్పుడు సంపత్ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రవితేజ గారు చేయకుండా విక్రమార్కుడు-2 ఉండదు. సరైన కాంబినేషన్ కుదరకుండా ఈ సినిమాను నేను నిర్మించను. ఏం జరుగుతుందో చూడాలి అని రాధామోహన్ తెలిపారు. మరి రవితేజ ఒప్పుకుని ఎప్పటికైనా ‘విక్రమార్కుడు-2’ పట్టాలెక్కుతుందేమో చూడాలి.
This post was last modified on March 7, 2024 7:18 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…