కొన్ని సినిమాల కోసం ఆయా యూనిట్ సభ్యులు పడ్డ కష్టం, తపన చూస్తేనే ఆ చిత్రాలు బాగా ఆడాలనే అభిప్రాయం కలుగుతుంది. అలాగే థియేటర్లకు వెళ్లి ఆ చిత్రాలను చూసి ప్రోత్సహించాలనిపిస్తుంది. ‘గామి’ అనే చిన్న సినిమా విషయంలో చాలామంది ఫీలింగ్ ఇదే. యువ కథానాయకుడు విశ్వక్సేన్ కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో మొదలైన సినిమా ఇది. విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు.. ఒక యంగ్ టీంతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు.
కేవలం 25 లక్షలు చేతిలో పెట్టుకుని ఆరంభించిన చిత్రమిది. ఈ సినిమా కాన్సెప్ట్, టీం ప్లానింగ్ నచ్చి సోషల్ మీడియాలో క్రౌైడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు పెట్టడానికి కొందరు ముందుకు రావడంతో సినిమా ముందుకు కదిలింది. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలకు ఓర్చి.. క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడకుండా సినిమాను పూర్తి చేసింది చిత్ర బృందం. చివర్లో యువి క్రియేషన్స్ లాంటి బేనర్ సహకారం లభించింది. సినిమాకు మంచి రిలీజ్ కూడా దక్కుతోంది.
ఒక యువ బృందం పడ్డ కష్టం, తపన లెజెండరీ డైరెక్టర్ రాజమౌళిని కూడా మెప్పించింది. అందుకే ‘గామి’ని కొనియాడుతూ రిలీజ్ ముంగిట ఆయన ఒక పోస్ట్ పెట్టారు. “కఠోరమైన కృషి ఉంటేనే అసాధ్యమైన కలలు నిజమవుతాయి. ‘గామి’ కోసం దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాకు చెప్పినపుడు ఈ మాట గుర్తుకొచ్చింది. ఈ సినిమా విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లెంత శ్రమించారో అర్థమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి” అని రాజమౌళి పేర్కొన్నారు.
చిన్న సినిమాలకు, కష్టపడి తీసిన చిత్రాలకు రాజమౌళి ఇలా అండగా నిలిచి ప్రమోట్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఎన్నో చిత్రాలకు ఇలా సపోర్ట్ చేశారు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ‘గామి’ కోసం ఆయన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో చాలామందికి రీచ్ అయి ఈ చిన్న సినిమాకు ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. రిలీజ్ టీంలో, తర్వాత చాలామంది సెలబ్రెటీలు తమ చిత్రాన్ని సపోర్ట్ చేస్తారని ‘గామి’ టీం ఆశిస్తోంది. ‘గామి’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
This post was last modified on March 6, 2024 9:34 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…