కాకతాళీయంగా అనిపిస్తున్నా ఆర్ఆర్ఆర్ స్నేహితులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఎదురవుతున్న పరిణామాల్లో చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరికీ గ్యాప్ వచ్చేసింది. ఎంత వేగంగా తీద్దామనుకున్నా నిర్మాణంలో ఆలస్యం జరుగుతూనే ఉంది. గేమ్ ఛేంజర్ విడుదల గురించి ఇప్పటికీ క్లారిటీ లేదు. షూటింగ్ ఆలస్యంగా మొదలైన దేవర ఏప్రిల్ లో రావాలని విశ్వప్రయత్నం చేసి చివరికి సాధ్యం కాక అక్టోబర్ కి షిఫ్ట్ అయ్యింది. అప్పుడైనా గ్యారెంటీనా అంటే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
చరణ్ మధ్యలో ఆచార్య చేశాడు కానీ అది క్యామియో కావడం వల్ల కౌంట్ లోకి తీసుకోలేం. ఇప్పుడు హీరోయిన్ జాన్వీ కపూర్ ఇద్దరి సినిమాల్లో ఎంపిక కావడం ఇంకో అనూహ్యమని చెప్పాలి. దేవరలో ముందు నటించింది. అందులో తన గెటప్, నటనకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ తారక్ ద్వారా దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ లకు చేరడంతో ఇంకో ఆలోచన చేయకుండా ఆర్సి 16కి లాక్ చేసుకున్నారు. న్యూస్ ఎప్పుడో లీకైనా ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఇలా తారక్, చరణ్ ల సరసన ఏకకాలంలో నటిస్తున్న క్రెడిట్ తో జాన్వీ కపూర్ ఎంట్రీ టాలీవుడ్ లో గ్రాండ్ గా జరగనుంది.
ఫ్రెండ్స్ కాబట్టి ఇన్నిరకాల సారూప్యతలు వస్తున్నాయని అనుకోవాలి. దేవర తర్వాత తారక్ బాలీవుడ్ లో వార్ 2 తో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో వైపు చరణ్ తో ఒక భారీ ప్రాజెక్టు చేసేందుకు ఒకరిద్దరు పేరు మోసిన హిందీ దర్శకులు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఆల్రెడీ చక్కర్లు కొడుతున్నాయి . ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ ఉంటుందనే ప్రచారం గతంలో జరిగినా అదేమీ లేదని అర్థమైపోయింది. ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు 29తో బిజీ అయిపోయాడు. కనీసం రెండు మూడేళ్లు పట్టేలా ఉంది. ఆ తర్వాతైనా ట్రిపులార్ కొనసాగింపు జరగడం కష్టమే.
This post was last modified on March 6, 2024 3:41 pm
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది.…
క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు…
సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ వేడుక. కలవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. కనీసంలో కనీసం..…
రెండున్నర గంటలు అండర్ కవర్ ఆపరేషన్ చేసి సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చే హీరోలాగా పండగ బరిలో లాస్ట్ వచ్చిన…
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)…
క్రియేటివిటీకి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్త తరం దర్శకుల ఆలోచనలు చూస్తే అదే అనిపిస్తుంది. గత…