తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన నివేథా పెతురాజ్ పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. ఆమె గురించి కొన్ని తమిళ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో వస్తున్న కథనాలు దుమారం రేపుతున్నాయి. నివేథాకు తమిళ హీరో, నిర్మాత, రాజకీయ నేత అయిన ఉదయనిధి స్టాలిన్‌కు సంబంధం ఉందని ఎప్పట్నుంచో ఒక ప్రచారం నడుస్తోంది.
ఐతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్లో ఆమె గురించి ఓ కథనం ప్రసారం చేశారు. అందులో అతిథిగా వచ్చిన వ్యక్తి.. నివేథాకు ఉదయనిధి దుబాయ్‌లో రూ.50 కోట్లతో ఒక ఖరీదైన ఇంటిని కొనిచ్చినట్లు వ్యాఖ్యానించాడు. నివేథా.. ఉదయనిధి విషయంలో చాలా పొసెసివ్‌గా ఉంటుందని, ఆమె ఇక్కడే ఉంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆమెకు దుబాయ్‌లో లులు మాల్ ఓనర్ ఉండే ప్రాంతంలో ఉదయనిధి లగ్జరీ హౌజ్ కొని ఇచ్చాడని.. ఆమె రెండు నెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి వెళ్తుంటుందని.. అప్పుడు ఉదయనిధి ఆమెను కలుస్తాడని అతను పేర్కొన్నాడు.
ఈ వీడియో వైరల్ అవడంతో నివేథా తాజాగా ఒక పెద్ద పోస్టు పెట్టింది ట్విట్టర్లో. తాను లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు, తనకు ఎవరెవరో ఏదేదో ఇచ్చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని ఆమె పేర్కొంది. తాను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చానని.. 16వ ఏట నుంచే ఇండిపెండెంట్‌గా బతుకుతున్నాని.. తన సంపాదన మీదే తన జీవితం గడుస్తోందని ఆమె వ్యాఖ్యానించింది. తన కుటుంబం 20 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటోందని.. అక్కడ తామున్నది అద్దె ఇంట్లో అని.. ఈ వాస్తవాలు తెలియకుండా కొందరు పనిగట్టుకుని తన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తన మీద ఇలాంటి ఆరోపణలు చేసిన వారి మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చని.. కానీ ఇప్పటికీ కొంత మానవత్వం మిగిలి ఉందని నమ్ముతూ తాను ఇంతటితో ఈ విషయాన్ని వదిలేస్తున్నానని.. ఇకనైనా తన గురించి ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని పేర్కొంది.
This post was last modified on March 5, 2024 6:07 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…