బాలీవుడ్ మల్టీస్టారర్ వార్ 2లో హృతిక్ రోషన్ తో పాటు తెరను పంచుకోబోతున్న జూనియర్ ఎన్టీఆర్ పాత్ర తాలూకు తీరుతెన్నులు ఎలా ఉంటాయనే దాని మీద ఉన్న సస్పెన్స్ మెల్లగా వీడుతోంది. టైగర్ 3 ఎండ్ టైటిల్స్ అయ్యాక హృతిక్ తో అషుతోష్ రానా చేసే ఫోన్ సంభాషణలో విలన్ గురించి చెబుతాడు. అది తారక్ క్యారెక్టరేననే ప్రచారం ఒక దశలో జరిగింది. కానీ అదేదీ నిజం కాదు. వార్ 2లో యంగ్ టైగర్ అత్యంత బాధ్యత కలిగిన ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా నటించబోతున్నాడు. ఎలాంటి ప్రతికూల ఛాయలు లేకుండా రచయిత కం నిర్మాత ఆదిత్య చోప్రా ఈ పాత్రను డిజైన్ చేశారట.
మరి హృతిక్ తో తనకు ఎలాంటి బాండింగ్ ఉంటుందనేది మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్. ఈ వారంలోనే జపాన్ దేశంలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్న తారక్ ఇది పూర్తవ్వగానే వార్ 2 సెట్స్ లో అడుగు పెడతాడు. ఈలోగా హృతిక్ రోషన్ కు సంబంధించిన సింగల్ సీన్లు ఫినిష్ చేస్తారు. అయితే ట్విస్టు ఇక్కడితో అయిపోలేదు. ఏజెంట్ గా కనిపించే తారక్ తర్వాత ఇదే క్యారెక్టర్ తో ఒక ఫుల్ మూవీ, అదయ్యాక టైగర్ వర్సెస్ పఠాన్ లాంటి యష్ స్పై యూనివర్స్ లో వచ్చే సినిమాల్లోనూ కనిపిస్తాడట. సో ఇదేదో ఆషామాషీ ప్లాన్ అయితే కాదు.
మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో ఇంకా తెలియనున్నాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఏడాది లోపే షూట్ పూర్తి చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నారు. ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ ఆల్రెడీ ఎంపికయ్యింది. యష్ సంస్థ తమ గూఢచారి సిరీస్ లో పఠాన్ 2, టైగర్ వర్సెస్ పఠాన్, అలియా భట్ చేయబోయే టైటిల్ నిర్ణయించని లేడీ స్పై మూవీ, టైగర్ 4 వరసగా ప్లాన్ చేసుకుంది. వార్ 3 కూడా ఉంటుందట. తారక్ సింగల్ గా నటించే సినిమాకు ఆ పాత్ర పేరే పెడతారు కానీ అదింకా లీక్ కాలేదు. మొత్తానికి బాలీవుడ్ లో బడా ప్లాన్లు వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు పెద్ద మార్కెట్ ఏర్పడనుంది.
This post was last modified on March 5, 2024 8:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…