ఒక పెద్ద సీనియర్ స్టార్ సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు. పాత్ర చిన్నదో పెద్దదో ఒక్కసారి స్క్రీన్ మీద కాంబినేషన్ వస్తుందనే ఉద్దేశంతో ఒప్పుకునే వాళ్లే ఎక్కువ. కానీ న్యాచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్ ల ఆలోచన, పద్ధతి ఈ విషయంలో మాత్రం ఒకటేనని చెప్పాలి. ముందు నాని సంగతి చూస్తే కొన్ని నెలల క్రితం రజనీకాంత్ హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టయ్యాన్ లో ఒక ముఖ్యమైన పాత్రని ఆఫర్ చేశారు. బాగా ఆలోచించిన నాని ఇది తనకు నప్పేది, ఉపయోగపడేది కాదని గుర్తించి గుర్తించి సున్నితంగా నో చెప్పాడు.
అది కాస్తా దగ్గుబాటి రానాని వరించింది. జీవితంలో మళ్ళీ రజనితో కలిసి నటించే ఛాన్స్ రావొచ్చు రాకపోవచ్చు. కానీ నాని రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే వద్దనుకున్నాడు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కూడా ఇదే అవలంబించాడు. 38 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ మణిరత్నంల లెజెండరీ కాంబోలో రూపొందుతున్న తగ్ లైఫ్ కి ఫస్ట్ ఓకే చెప్పాడు. కానీ తాజాగా కాల్ షీట్స్ సమస్య వల్ల ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు వచ్చిన తాజా అప్డేట్ ఫ్యాన్స్ ని షాక్ గురి చేసింది. కమల్ అంటే దుల్కర్ తండ్రి, కేరళ మెగాస్టార్ మమ్ముట్టి సమకాలికుడు.
ఒకరకంగా చెప్పాలంటే చాలా అరుదైన అవకాశం. అయినా సరే కమిట్ మెంట్లను దృష్టిలో ఉంచుకుంది హుందాగా పక్కకు వచ్చాడు. దీన్ని బట్టే కెరీర్ ప్లానింగ్ లో మీడియం రేంజ్ హీరోలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కమల్, రజని ఆరు పదుల వయసు దాటేసి వేగంగా సినిమాలు చేయడంలో పరుగులు పెడుతున్నారు. ఇంకెన్ని నటిస్తారో చెప్పలేం కానీ వాళ్ళతో క్యాస్టింగ్ లో భాగం కావడమనేది అదృష్టంగా భావిస్తారు. కానీ నాని, దుల్కర్ లు మాత్రం క్రేజ్ గురించి పట్టించుకోకుండా ఇంత స్పష్టంగా ఆలోచించడం విశేషమే. నాని సరిపోదా శనివారం, దుల్కర్ లక్కీ భాస్కర్ లతో బిజీగా ఉన్నారు.
This post was last modified on March 5, 2024 12:02 pm
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…