ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్‌ను హీరోగా పరిచయం చేయడానికి కొన్నేళ్ల ముందే ప్రయత్నాలు మొదలు కాగా.. అతను హీరోగా పరిచయం కావాల్సిన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ ఏవో కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఐతే ఆ తర్వాత పెద్దగా హడావుడి లేకుండా ‘మ్యాడ్’ మూవీలో ముగ్గురు హీరోల్లో ఒకడిగా కనిపించి లాంఛనాన్ని పూర్తి చేశాడు నితిన్. ఈ సినిమా మంచి హిట్టయింది కానీ నితిన్‌కు పెద్దగా పేరైతే రాలేదు. సంగీత్ శోభన్ డామినేషన్‌తో నితిన్ వెనకబడిపోయాడు.
ఇప్పుడు నార్నె నితిన్‌ను పూర్తి స్థాయి హీరోగా పరిచయం చేసే బాధ్యతను గీతా ఆర్ట్స్-2 తీసుకుంది. ఈ సంస్థలో నితిన్ చేస్తున్న సినిమాకు తాజాగా టైటిల్ అనౌన్స్ చేశారు. ‘ఆయ్’ అనే ఫన్నీ టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేశారు.
అంజి కంచిపల్లి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ కొంచెం భిన్నంగా చేసింది చిత్ర బృందం. కొత్త దర్శకులు సినిమాలు తీయడంలోనే కాదు.. టైటిల్ పెట్టడంలోనూ లేటే అని విసుక్కుంటూ బన్నీ వాసు డైరెక్టర్ అంజికి ఫోన్ చేయడం.. అతను తమాషాగా ‘ఆయ్’ అనే టైటిల్ చెప్పడం.. అది అర్థం కాక బన్నీ వాసు హీరో హీరోయిన్లను లైన్లో తీసుకోవడం.. చివరికి ‘ఆయ్’ అన్నదే టైటిల్ అని డైరెక్టర్ రివీల్ చేయడం.. సూపర్ హిట్ టైటిల్ పెట్టావని అప్రిషియేట్ చేస్తూ సమ్మర్లో కుమ్మేద్దాం అని బన్నీ వాసు అనడంతో వీడియో ముగిసింది.
‘ఆయ్’ అనే టైటిల్‌కు ‘మేం ఫ్రెండ్సండీ’ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఈ నెల 7న ‘ఆయ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు. బన్నీ వాసుతో కలిసి విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
This post was last modified on March 4, 2024 3:22 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…