Movie News

పాత ఫ్లాప్ సినిమాకు కొత్త వైభవం

ఒక కాలంలో థియేటర్లో ఆడని సినిమాలు తర్వాత జనరేషన్ లో కల్ట్ స్టేటస్ తెచ్చుకోవడం ఈ మధ్య చూస్తున్నాం. ఆరంజ్, ఓయ్ లాంటి వాటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సరే ఇవంటే మరీ పాతవి కాదు కాబట్టి ఏదో అనుకోవచ్చు. ఎప్పుడో ముప్పై మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఒక ఫ్లాప్ మూవీకి ఇప్పుడు ఆదరణ దక్కడమంటే అరుదే. అదెలాగో చూద్దాం. ఇటీవలే మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మంజుమ్మెల్ బాయ్స్ ప్రధానంగా కొడైకెనాల్ లోని ఒక గుహలో జరిగే సంగతి తెలిసిందే. దర్శకుడు చిదంబరం తీసుకున్న మెయిన్ పాయింట్ వెనుక ఓ కథుంది.

1991లో విడుదలైన కమల్ హాసన్ గుణ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. మానసిక స్థితి సరిగా లేని యువకుడు ప్రాణహాని ఉన్న ధనవంతురాలైన హీరోయిన్ ని అనుకోని పరిస్థితుల వల్ల తీసుకెళ్లి ఒక గుహలో దాచి ప్రాణంగా చూసుకుంటాడు. ఆమెని దేవతలా భావించి ప్రేమిస్తాడు. గుహలో ఉన్నప్పుడే ఇళయరాజా స్వరపరిచిన ‘కమ్మని ఈ ప్రేమలేఖలే రాసింది హృదయమే’ పాట పాడుకుంటారు. సినిమా సంగతి ఎలా ఉన్నా ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. మ్యూజిక్ లవర్స్ ని ఓలలాడించింది. దీన్నే బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా మంజుమ్మెల్ బాయ్స్ తీశారు.

దెబ్బకు పాత గుణని వెతికి మరీ చూడటం మొదలుపెట్టారు మంజుమ్మెల్ బాయ్స్ ని ఇష్టపడిన కుర్రకారు. యూట్యూబ్, పలు వెబ్ సైట్స్ లో ఇప్పటికే అందుబాటులో ఉండగా ఇటీవలే ఒక శాటిలైట్ ఛానల్ రీ మాస్టర్ చేసిన ప్రింట్ ని ప్రీమియర్ గా ప్రసారం చేసింది. అప్పుడు తిరస్కారానికి గురైన గుణకి తర్వాతి రోజుల్లో కల్ట్ స్టేటస్ ఎందుకు వచ్చిందో క్రమంగా అర్థం చేసుకుంటున్నారు. నటుడు సంతాన భారతి దర్శకత్వం వహించిన గుణ తెలుగులో కూడా డిజాస్టరే. అయినా సరే విమర్శకుల ప్రశంసలు, పలు అవార్డులు రివార్డులు దక్కించుకుంది. తెలుగులో మార్చి 15 మంజుమ్మెల్ బాయ్స్ వస్తోంది.

This post was last modified on March 4, 2024 2:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సీఐడీ కోర్టులోనూ బెయిల్.. పోసాని రిలీజ్ అయినట్టేనా?

టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా…

30 minutes ago

ప‌వ‌న్ ప్ర‌యోగాలు.. సైనికుల ప‌రేషాన్లు..!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న ప్ర‌యోగాలు.. జ‌న‌సేన నాయ‌కుల‌కు ఇబ్బందిగా మారుతున్నాయి. సాధార‌ణంగా పార్టీని…

2 hours ago

వ‌ర్గీక‌ర‌ణ ఓకే.. `వ‌క్ఫ్` మాటేంటి.. బాబుకు ఇబ్బందేనా?

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌రో కీల‌క‌మైన వ్య‌వ‌హారం క‌త్తిమీద సాముగా మార‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు పాలన వేరు.. ఆమోదించిన బిల్లులు..…

2 hours ago

‘ముంతాజ్’కు మంగళం పాడేసిన చంద్రబాబు

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరికి అత్యంత సమీపంలో ఓ ప్రైవేట్ హోటల్ వెలిసేందుకు అనుమతులు జారీ…

2 hours ago

ఆంధ్రా కింగ్ పాత్రలో సీనియర్ స్టార్ ?

ఎనర్జిటిక్ స్టార్ రామ్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్…

3 hours ago

తిరుమలలో బాబు ఫ్యామిలీ… అది ట్రెడిషన్ గా మారిందా?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబం మొత్తాన్ని తీసుకుని శుక్రవారం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని…

3 hours ago