Movie News

మీనాక్షి చౌదరి లక్కు మారుతోంది

అందం, అభినయం రెండూ ఉన్నా సరైన బ్రేక్ కోసం ఎదురు చూసిన మీనాక్షి చౌదరికి ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారంలో నటించిన ఆనందం రవ్వంత కూడా మిగల్లేదు. ఫలితం సంగతి పక్కనపెడితే అందులో ఆమెకు దక్కిన ప్రాధాన్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేవలం హీరో, దర్శకుడు కాంబో చూసి గుడ్డిగా ఒప్పేసుకుంటే నష్టమే తప్ప లాభం లేదని అర్థమైపోయింది కాబోలు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తన చేతిలో వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, విజయ్ గోట్ సెట్స్ మీద ఉన్నాయి.

ఇవి కాకుండా వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సంక్రాంతికి వస్తున్నాం (ప్రచారంలో ఉన్న టైటిల్) లో తననే హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. చిరంజీవి విశ్వంభర ఆఫర్ కు ఓకే చెప్పిందనే ప్రచారం మొన్నటి నుంచే తిరిగుతోంది. ఈ రెండూ ఒప్పేసుకుంటే కెరీర్ పరంగా వేగం మొదలైనట్టే. భగవంత్ కేసరి మినహాయించి శ్రీలీలకు గత ఆరు నెలల కాలంలో మూడు డిజాస్టర్లు, ఒక ఎబోవ్ యావరేజ్ పడ్డాయి. దీంతో పీక్స్ డిమాండ్ లో చిన్నగా తగ్గుదల మొదలైంది. దర్శకులు ఇతర ఆప్షన్లు చూడటం మొదలుపెట్టారు.

మీనాక్షి చౌదరి లాంటి వాళ్ళు ఈ స్పేస్ ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్న హీరోయిన్లలో ఇప్పుడు తనే ముందుంది. విశ్వక్ సేన్ తో గత ఏడాదే ఒక సినిమా మొదలైంది కానీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. వీటిలో కనీసం రెండు మూడు హిట్ అయినా చాలు ఒక్కసారిగా లక్కు మారిపోయి కెరీర్ ఊపందుకుంటుంది. రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ చేస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలో ఆఫర్ దక్కడమే అతి పెద్ద ప్రమోషనని చెప్పాలి. వర్కౌట్ అయితే మాత్రం తమిళ తెలుగులో రెండు భాషల్లో యమా బిజీ అయిపోవచ్చు.

This post was last modified on March 4, 2024 11:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఆనందం అంతా ఇంతా కాదు… ఎందుకంటే…

ఏపీ ముఖ్య‌మంత్రిగా కూట‌మి ప్ర‌భుత్వాన్ని చ‌క్క‌టి స‌మ‌న్వ‌యంతో ముందుకు న‌డిపిస్తున్న చంద్ర‌బాబుకు 10 నెల‌లు పూర్తయ్యాయి. గ‌త ఏడాది జూన్…

3 hours ago

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…

8 hours ago

బావగారు వివాదం….సుడిగాలి సుధీర్ మెడకు

యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…

8 hours ago

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

9 hours ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

10 hours ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

10 hours ago