Movie News

గామికి ఆ పోలిక రిస్కేమో విశ్వక్

వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న గామి గురించి ఓ నెల రోజుల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలియదు కానీ ట్రైలర్ చూశాక ఒక్కసారిగా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ వండర్ హీరో విశ్వక్ సేన్ తన కెరీర్ ప్రారంభంలో ఒప్పుకున్నది. అఘోరాగా డిఫరెంట్ షేడ్స్ తో ఉన్న క్యారెక్టర్ ఛాలెంజ్ అవుతుందని రిస్క్ చేసి ఒప్పుకున్నాడు. ఈలోగా తన మార్కెట్, ఇమేజ్ లో చాలా మార్పులొచ్చేశాయి. అదే ప్లస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ కంటెంట్ లా కనిపిస్తోందని ఇప్పటికే ప్రశంసలు అందుతున్నాయి.

విశ్వక్ సేన్ మాత్రం ఇది క్రిస్టోఫర్ నోలన్ రేంజ్ టేకింగని, సినిమా చూశాక గొప్ప అనుభూతితో థియేటర్ నుంచి బయటికి వస్తారని హామీ ఇస్తున్నాడు. నిజానికి నోలన్ తో పోలికే పెద్ద రిస్క్. ఎందుకంటే ఓపెన్ హెయిమర్, టెనెట్ లాంటివి సామాన్య జనాలకు అర్థమైన క్లాసిక్స్ కాదు. ఆయన ఫిలిం మేకింగ్ ఆస్వాదించే వాళ్లకు మాత్రం అవి గొప్పగా కనెక్ట్ అవుతాయి. అవతార్, టైటానిక్, జురాసిక్ పార్క్ తరహా యునివర్సల్ అప్పీల్ ఉండదు. అయినా సరే బెస్ట్ ఫిలిం మేకింగ్ కి ఆయన్నే కేరాఫ్ అడ్రెస్ గా చెప్పేవాళ్ళు ఎందరో. మాస్ జనాలకు సులభంగా అర్థం కానీ స్టైల్ నోలన్ ది.

కానీ గామి అలా కాదు. దానికి పెట్టిన బడ్జెట్ కి వర్కౌట్ కావాలంటే అన్ని వర్గాలను మెప్పించాలి. కార్తికేయ 2, ఆర్ఆర్ఆర్ తరహాలో యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలి. దానికి అన్ని వర్గాల ప్రేక్షకుల మద్దతు అవసరం. గామికి పోటీ గట్టిగానే ఉంది. గోపీచంద్ భీమాని మంచి కమర్షియల్ ప్యాకేజీగా ప్రమోట్ చేస్తున్నారు. మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలుకి తెలుగులో భారీ పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. వీటికి తట్టుకుని నిలవాలంటే అంత సులభం కాదు. సీరియస్ టోన్ లో సాగే డివోషనల్ థ్రిల్లర్ గామి. పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం ప్రేక్షకులు క్యూ కట్టేస్తారు. అది తెచ్చుకోవడమే కీలకం

This post was last modified on March 3, 2024 7:56 am

Share

Recent Posts

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

38 minutes ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

45 minutes ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

4 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

7 hours ago