టాలీవుడ్ కు ఆస్కార్ తీసుకొచ్చిన నాటు నాటు పాట వైబ్రేషన్లు ఇప్పట్లో వదిలేలా లేవు. కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్ సాహిత్యంతో ఆ పాట చేసిన మేజిక్ అంతా ఇంతా కాదు. అయితే ఇది కేవలం సాంగ్ వల్ల వచ్చిందని మాత్రం చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటాపోటీగా లయబద్దంగా స్టెప్పులు వేయకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంత గుర్తింపు వచ్చేది కాదన్నది వాస్తవం. గతంలో నాటు నాటుని మించిన పాటలు ఎన్నో వచ్చాయి. గుర్తింపు దక్కడంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చేమో కానీ నాటు నాటుకి రాజమౌళి బృందం తీసుకొచ్చిన హైప్ మాత్రం మాటల్లో కొలవలేనిది.
దీనికి మరింత బలం చేకూర్చేలా జరిగిన సంఘటన ఇంటర్ నెట్ లో వైరల్ అవుతోంది. బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూస్తున్నాం. పెళ్లికి ఇంకో నాలుగు నెలలు టైం ఉన్నా ముందస్తు వేడుకనే ఈ స్థాయిలో జరపడం చూసి ప్రపంచ మీడియా సైతం నివ్వెరబోతోంది. నిన్న రాత్రి జరిగిన సంగీత్ తరహా ఫంక్షన్ లో బాలీవుడ్ ఖాన్ల ద్వయం అమీర్ ఖాన్ – షారుఖ్ ఖాన్ – సల్మాన్ ఖాన్ ముగ్గురూ నాటు నాటు పాటకు తారక్ చరణ్ లాగే స్టెప్పులు వేయడం చూసి ప్రాంగణం మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది.
ఇలాంటి అరుదైన దృశ్యం చూసినప్పుడు తెలుగు వాడి ఛాతి పొంగకుండా ఎలా ఉంటుంది. వరల్డ్ టాప్ ఈవెంట్స్ లో ఒకటిగా చెప్పుకుంటున్న అనంత్ అంబానీ వెడ్డింగ్ లో ఇండియా మోస్ట్ వాంటెడ్ స్టార్స్ అందరూ నాటు నాటు అంటూ గెంతులు వేయడం కన్నా రాజమౌళి లాంటి ఫిలిం మేకర్ కి కావాల్సింది ఏముంటుంది. సౌత్ సినిమానాని ఒకప్పుడు చులకనగా చూసే కోణాన్ని ఇంత సమూలంగా మార్చిన ఘనత జక్కన్నకే దక్కుతుంది. ఇదొక్కటే కాదు పుష్పలో ఊ అంటావా ఊహూ అంటావాకు కూడా పలువురు స్టార్లు కాలు కదిపారని లైవ్ లో చూసిన వాళ్ళ స్పెషల్ రిపోర్ట్.
This post was last modified on March 3, 2024 7:52 am
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…