సరే ఏజెంట్ పోయింది. డిజాస్టర్ కన్నా దారుణంగా దాని గురించి మాట్లాడుకున్నారు. ఇదంత ప్రతి హీరోకు ఏదో ఒక దశలో ఎదురయ్యే అనుభవమే. చరిత్రలో ఎవరూ మినహాయింపు కాదు. కానీ అఖిల్ మాత్రం ఇంకా దాని తాలూకు గాయాల నుంచి బయటికి వచ్చాడో లేదోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పదకొండు నెలలు గడిచిపోయాయి. ఏప్రిల్ లో ఏజెంట్ ఫస్ట్ యానివర్సరీ వస్తుంది. అయినా సరే ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టలేదు. నాన్న నా సామిరంగతో తిరిగి ట్రాక్ లో పడ్డారు. అన్నయ్య నాగ చైతన్య తండేల్ మీద క్రమంగా బజ్ పెరుగుతోంది.
ఎటొచ్చి అఖిల్ మాత్రం కెమెరా ముందుకు రావడం లేదు. తాజాగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో యమా ఉత్సాహంగా పాల్గొని టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించడం సంతోషించాల్సిన విషయమే అయినా దాని వల్ల కెరీర్ పరంగా వచ్చే ప్రయోజనం శూన్యం. సరదాగా ఆడే ఆటే తప్పించి ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది చేయబోయే సినిమాల మీద. యువి క్రియేషన్స్ బ్యానర్ మీద అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఒక ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ఎప్పుడో ఓకే అయ్యింది. అదిగో ఇదిగో అంటూ మీనమేషాలు లెక్కబెడుతున్నారు తప్పించి ఫలానా టైంలో స్టార్ట్ చేస్తామని చెప్పడం లేదు.
చాలా లేట్ గా ఓకే అయిన చిరంజీవి విశ్వంభరని ఇదే యూవీ సంస్థ వేగంగా పరుగులు పెట్టిస్తోంది. అనుష్క దర్శకుడు క్రిష్ కాంబోలో మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికీ రూట్ క్లియర్ చేశారు. కానీ అఖిల్ ది మాత్రం ముందుకు తీసుకెళ్లడం లేదు. స్క్రిప్ట్ విషయంలో పూర్తి సంతృప్తి కలగనందు వల్లే ;లేట్ అవుతోందని, ఫైనల్ వెర్షన్ అందరికీ నచ్చగానే సెట్స్ పైకి వెళ్తుందని ఇన్ సైడ్ టాక్. బడ్జెట్ తగ్గించే దిశగా కొంత వర్క్ జరుగుతోందట. అఖిల్ ఇంతకంటే ఆలస్యం చేయకూడదు. హిట్టో ఫ్లాపో వరసగా చేసుకుంటూ పోవడమే ఒక లెగసిని మోస్తున్న అఖిల్ లాంటి హీరోలు చేయాల్సింది.
This post was last modified on March 2, 2024 2:50 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…