ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని సృష్టించిన దృశ్యం హాలీవుడ్ లో రీమేక్ కాబోతోందనే వార్త నిన్న సోషల్ మీడియాని ఊపేసింది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ తరువాత ఇతర భాషల్లో వెంకటేష్, అజయ్ దేవగన్, రవి చంద్రన్ లాంటి బడా స్టార్లు కోరిమరీ రీమేక్ చేసుకుని విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఒక సౌత్ మూవీని మొట్టమొదటి సారి ఇంగ్లీష్ లో తీస్తున్నారనే కామెంట్ మాత్రం నిజం కాదని చెప్పాలి. ఎందుకంటే ఆ ఘనత పన్నెండేళ్ల క్రితం మన తెలుగు దర్శకుడు ఒక ఎమోషనల్ మూవీతో సాధించాడు. అదేంటో చూద్దాం.
1997లో శ్రీకాంత్, రమ్యకృష్ణ, హీరా జంటగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆహ్వానం వచ్చింది. మంచి సక్సెస్ అందుకుంది. భార్యకు ఇష్టం లేకపోయినా భర్త విడాకులు కోరుతున్నప్పుడు పెళ్లి లాగే విడిపోయే తతంగం కూడా ఊరందరి ముందు జరగాలనే విభిన్నమైన పాయింట్ ని తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ కి మహిళలు బాగా కనెక్ట్ అయ్యారు. స్పెషల్ జ్యురీ విభాగంలో నంది అవార్డు కూడా వచ్చింది. పదిహేనేళ్ల తర్వాత 2012లో ఇదే ఆహ్వానాన్ని హాలీవుడ్ లో ‘డివోర్స్ ఇన్విటేషన్’ పేరుతో రీమేక్ చేశారు. జోనాథన్ బెన్నెట్, జామీ హీరో హీరోయిన్లు గా నటించారు.
ఎస్వి కృష్ణారెడ్డినే దర్శకత్వం వహించారు. 2012 నవంబర్ 15 రిలీజయ్యింది. అమెరికా జనాలకు అంతగా కనెక్ట్ కాలేదు కానీ మేకింగ్ పరంగా పేరు వచ్చింది. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో ఆయన ఇవి వేరువేరని చెప్పారు కానీ మూల కథ ఒకటేనని రెండు చూసినవాళ్లకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ లెక్కన చూసుకుంటే దృశ్యం కన్నా ముందు ఈ రీమేక్ రికార్డు ఆహ్వానంకు చెందుతుంది. ఒకవేళ ఇంగ్లీష్ వెర్షన్ కూడా హిట్ అయ్యుంటే మన జనాలకు గుర్తుండేది కానీ ఫలితం వల్ల అందరూ మర్చిపోయారు. అయితే దృశ్యం పదికి పైనే భాషల్లో రీమేక్ కావడం వల్ల ఆహ్వానం కంటే పైనే ఉందని చెప్పాలి.
This post was last modified on March 1, 2024 1:53 pm
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…