ఇండియన్ సినిమా చరిత్రలో బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే మూవీ.. దృశ్యం. ఫ్యామిలీ అంశాలతోనే ఎంతో థ్రిల్లింగ్‌గా ఈ సినిమాను జీతు జోసెఫ్ మలిచిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ అరుదైన కథాంశం ఇప్పటికే లెక్కలేనన్ని భాషల్లో రీమేక్ అయింది. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా పలు భారతీయ భాషల్లో ‘దృశ్యం’ను రీమేక్ చేశారు. బహుశా ఇండియాలో అత్యధిక భాషల్లో రీమేక్ అయిన సినిమా ఇదే కావచ్చు. ఇలా రీమేక్ అయిన ప్రతి భాషలోనూ సూపర్ హిట్ కావడం ఆ కథ ప్రత్యేకత.
విశేషం ఏంటంటే.. ‘దృశ్యం’ విదేశీ భాషల్లోనూ రీమేక్ అయి సక్సెస్ సాధించింది. శ్రీలంక అధికార భాష అయిన సింహళీలో.. అలాగే చైనీస్, కొరియన్ భాషల్లోనూ ‘దృశ్యం’ను రీమేక్ చేయగా.. అక్కడా మంచి స్పందన వచ్చింది. ఇదే విశేషం అంటే.. ఇప్పుడు హాలీవుడ్లోకి కూడా వెళ్లబోతోంది దృశ్యం స్టోరీ.
హాలీవుడ్లో అధికారికంగా రీమేక్ కానున్న తొలి భారతీయ చిత్రంగా ‘దృశ్యం’ రికార్డు సృష్టించబోతోంది. హాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్.. మరో నిర్మాణ సంస్థతో కలిసి ‘దృశ్యం’ను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించింది. పనోరమ స్టూడియోస్ నుంచి వాళ్లు రీమేక్ హక్కులు తీసుకున్నారు.
హాలీవుడ్ నుంచి అధికారిక రీమేక్‌లకు తోడు బోలెడన్ని ఫ్రీమేక్‌లు మన స్క్రీన్ మీదికి వచ్చేస్తుంటాయి. కానీ మన కథ నచ్చి హాలీవుడ్లో రీమేక్ చేయడానికి అధికారికంగా హక్కులు తీసుకోవడం అన్నది ఊహకందని విషయం. ఇది ఇండియన్ సినిమాకే గర్వకారణం. ‘దృశ్యం’ ఎంతటి సార్వజనీనమైన కథ అనడానికి ఇది ఉదాహరణ. మరి ఇప్పటిదాకా రీమేక్ అయిన అన్ని భాషల్లో సక్సెస్ అయినట్లే హాలీవుడ్లోనూ ఈ కథ హిట్ అవుతుందేమో చూడాలి.
This post was last modified on February 29, 2024 3:29 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…