Movie News

మహేష్ మెచ్చుకున్న ‘పోచర్’లో ఏముంది

మాములుగా సినిమాలు చూసేందుకే స్టార్ హీరోలకు టైం ఉండదు. అలాంటిది వెబ్ సిరీస్ లంటే మహా కష్టం. గుంటూరు కారం తర్వాత రాజమౌళి సెట్లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్న మహేష్ బాబుకి సమయం దొరికినట్టు ఉంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన పోచర్ మీద లుక్కేశాడు. అక్కడితో ఆగలేదు. దాన్ని ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ఇన్స్ టా స్టోరీని పెట్టడంతో ఒక్కసారిగా అభిమానుల దృష్టి దాని మీదకు వెళ్ళింది. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ కు సహ నిర్మాతగా ఇది మొదటి డిజిటల్ వెంచర్. అందుకే పోయిన గురువారం సెలబ్రిటీలకు ప్రీమియర్ వేశారు.

ఇది ఏనుగు దంతాలను దోచుకునే మాఫియా కథ. కేరళ రాష్ట్రం మలయత్తు ప్రాంతంలో ఉండే అడవి స్మగ్లింగ్ కి నెలవు. రేంజ్ ఆఫీసర్ గా పని చేసే మాల(నిమిష విజయన్)కు పద్దెనిమిది ఏనుగులు హత్యకు గురైన కేసుని అప్పగిస్తారు. డిపార్ట్ మెంట్ వ్యక్తే దొంగలకు సహకరించి అప్రూవర్ గా మారిపోతాడు. విచారణ చేసి హంతకులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన అలెన్(రోషన్ మాధ్యు) బృందంలో మాలకు చోటు దక్కుతుంది. మూలాలు తవ్వే కొద్దీ లింకులు ఎక్కడో ఢిల్లీ దాకా వెళ్తాయి. దీని వెనుక ఉన్నది మోరిస్, రాజ్ అని తెలుస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.

మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్న పోచర్ సుదీర్ఘంగా సాగుతుంది. సీరియస్ నేపథ్యంలో సాగే ఈ ఫారెస్ట్ థ్రిల్లర్ లో తగినన్ని మలుపులు, పాత్రల మధ్య సంఘర్షణ అవసరమైన మోతాదులో దర్శకుడు రిచి మెహతా దట్టించినా డ్రామా పాలు ఎక్కువ కావడంతో కొంత ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యాక అవసరం లేని చోట ఫార్వార్డ్ కి పని చెప్పుకుంటూ పోతే పోచర్ ఓ మోస్తరుగా పర్వాలేదనే భావన వస్తుంది. ఎప్పుడూ సైకో మర్డర్ల చుట్టూ తిరిగే సిరీస్ ల మధ్య ఈ పోచర్ డిఫరెంట్ ఫీలింగ్ కలిగిస్తుంది. కాలక్షేపం కాక సమయం తగినంత ఉంటే పోచర్ ని ట్రై చేయొచ్చు.

This post was last modified on February 27, 2024 9:28 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 minutes ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

2 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

2 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

3 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

3 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

4 hours ago