ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే రాజమౌళి తర్వాతి స్థానం ప్రశాంత్‌దే. ‘కేజీఎఫ్’ అనే ఒకే ఒక్క సినిమాతో అతడి రేంజే మారిపోయింది. ‘సలార్’ సైతం పెద్ద సక్సెస్ కావడంతో ప్రశాంత్ ఇమేజ్ ఇంకా పెరిగింది. అతను తర్వాత తీయబోయే సినిమాల మీద భారీ అంచనాలున్నాయి.
రాజమౌళి తర్వాత వెయ్యి కోట్ల బిజినెస్ చేసే స్థాయి ఉన్న దర్శకుడు ప్రశాంతే. కన్నడ సినిమా స్థాయిని ఎంతగానో పెంచి.. ఆ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తున్న ప్రశాంత్‌కు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అతణ్ని అందరికంటే ఎక్కువగా ఇన్‌స్పైర్ చేసింది ఎవరు? ఈ ప్రశ్నలకు ఓ ఇంటర్వ్యూలో అతను సమాధానం ఇచ్చాడు. అతను చెప్పిన పేరు.. ‘ఉపేంద్ర’ కావడం విశేషం.
ఓ కన్నడ సినీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. “నేను కన్నడ కార్యక్రమంలో ఉన్నా కాబట్టి ఈ మాట చెప్పట్లేదు. నాకు నచ్చిన దర్శకుడు ఉపేంద్ర. ఆయనలా సినిమాలు తీయడం ఎవరికీ సాధ్యం కాదు. కథ చెప్పే విధానంలో, వాటిని తెరపైన ఆవిష్కరించే తీరులో ఉపేంద్ర చాలా వైవిధ్యం చూపిస్తాడు. ఏ, ఓం, ష్, ఉపేంద్ర లాంటి సినిమాలు చూస్తే.. సినిమాలు ఇలా తీసి కూడా హిట్టు కొట్టొచ్చా అనిపిస్తుంది. ఆయన స్టైలే వేరు” అని ప్రశాంత్ అన్నాడు.
ప్రశాాంత్ మాటల్లో అతిశయోక్తి ఏమీ కనిపించదు. ఇప్పుడు అందరూ సినిమాల్లో కొత్తదనం గురించి మాట్లాడుకుంటున్నారు కానీ.. 90వ దశకంలోనే ఎ, రా, ఉపేంద్ర లాంటి సినిమాలతో సంచలనం రేపాడు ఉప్పి. తెలుగులోనూ ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఉప్పి స్వీయ దర్శకత్వలో ‘యు’ అనే వెరైటీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 27, 2024 4:31 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…