మాములుగా సినీ పరిశ్రమలో అబ్బాయిలను వారసులుగా సెటిల్ చేసేందుకు స్టార్ హీరోలు కష్టపడటం మాములే. స్వంతంగా సినిమాలు తీయడం ద్వారానో లేక పెద్ద బ్యానర్లు వచ్చేలా చేయడం వల్లనో ఏదో ఒక రూపంలో లెగసిని కొనసాగించేలా చూసుకుంటారు. కానీ కింగ్ షారుఖ్ ఖాన్ మాత్రం దానికి భిన్నంగా కూతురు సుహానాకి ఒక మంచి ఓపెనింగ్ ఇచ్చేందుకు ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. ఇటీవలే ఈ అమ్మాయి నెట్ ఫ్లిక్స్ మూవీ ది ఆర్చీస్ తో డెబ్యూ చేసింది. లుక్స్, యాక్టింగ్ రెండూ ట్రోలింగ్ కు గురయ్యాయి. కంటెంట్ కూడా బాలేకపోవడంతో డిజిటల్ డిజాస్టర్ అయ్యింది.
కట్ చేస్తే సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యింది. కింగ్ టైటిల్ తో రూపొందబోయే భారీ బడ్జెట్ చిత్రంలో షారుఖ్ ఎక్కువ నిడివి ఉండే ప్రత్యేక పాత్ర చేయబోతున్నాడు. నిర్మాణం తన రెడ్ చిల్లీస్ బ్యానర్ మీదే జరగనుంది. దీనికి ఇద్దరు దర్శకత్వం వహిస్తారని ముంబై టాక్. ప్రధాన బాధ్యతలు సుజయ్ ఘోష్ నిర్వహిస్తే యాక్షన్ ఎపిసోడ్లను సిద్దార్థ్ ఆనంద్ పర్యవేక్షిస్తాడట. ప్రస్తుతం షారుఖ్ స్వంత ఇల్లు మన్నత్ లో వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. సుహానాకి శిక్షణ ఇచ్చేందుకు విదేశి నిపుణులను రప్పించారు. డంకీ తర్వాత షారుఖ్ ఖాళీగానే ఉన్నాడు.
ఆ సమయాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నాడు. ఈ ఏడాది మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ప్యాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేసేలా స్కెచ్ వేశారట. ఆర్చీస్ లో దేని గురించి అయితే ఎక్కువ నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందో ప్రత్యేకంగా ఆ అంశాల మీద శ్రద్ధ పెడుతున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ ఎమోషన్స్ కు పెద్ద పీఠ ఉండేలా, షారుఖ్ సుహానాల మధ్య వచ్చే సన్నివేశాలు బెస్ట్ అనిపించేలా తీర్చిదిద్దుతారట. కొడుకు కన్నా ముందు కూతురి పట్ల ఇంత కేర్ తీసుకుంటున్న షారుఖ్ ని ఒక తండ్రిగా ఖచ్చితంగా అభినందించాల్సిందే.
This post was last modified on February 27, 2024 12:19 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…