ఈ ఏడాది ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమా అంటే మరో మాట లేకుండా కల్కి పేరు చెప్పేయొచ్చు. ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాకు ఉన్న ఆకర్షణలు అన్నీ ఇన్నీ కావు. ప్రభాస్ హీరో అంటేనే కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతారు. పైగా ఇది అతడి కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా. పైగా ఫాంటసీ టచ్ ఉన్న సైఫై థ్రిల్లర్.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణానికి తోడు ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికే అనుకున్న ఈ చిత్రాన్ని మే 9కి వాయిదా వేసిన సంగతీ తెలిసిందే. ఐతే ఈ సినిమా ఆ టైంకి రెడీ అవుతుందా అనే విషయంలో సందేహాలు ముసురుకున్నాయి.
కానీ వైజయంతీ మూవీస్ మాత్రం పక్కాగా మే 9కే సినిమాను రిలీజ్ చేస్తామని అంటోంది. ఇంకా ఈ మూవీ షూట్ పూర్తయినట్లు కూడా అప్‌డేట్ బయటికి రాలేదు. మరి భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ సినిమాను ఇంకో 70 రోజుల్లో రిలీజ్ చేయగలరా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.
దీనికి తోడు కల్కికి సంబంధించి వస్తున్న తాజా సమాచారం ఏంటంటే.. ఈ చిత్రాన్ని ఏకంగా 22 భాషల్లో రిలీజ్ చేస్తున్నారట. అన్ని భారతీయ ప్రధాన భాషలతో పాటు అంతర్జాతీయంగా అనేక లాంగ్వేజెస్‌లో కల్కిని డబ్ చేసి రిలీజ్ చేయనున్నారట. మరి అన్ని భాషల్లో రిలీజ్ అంటే డబ్బింగ్ అదీ చేయడానికే చాలా టైం పడుతుంది. ఈ సినిమా రేంజ్ దృష్ట్యా డబ్బింగ్ ఆషామాషీగా చేసినా కష్టమే. మరి అన్ని భాషల్లో పర్ఫెక్ట్‌గా సినిమాను సిద్ధం చేసి మే 9న రిలీజ్ చేయడం అంటే అసాధ్యమైన పనిలాగే అనిపిస్తోంది. మరి టీం కాన్ఫిడెన్స్ ఏంటో చూడాలి.
This post was last modified on February 26, 2024 6:14 am
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…