గత ఏడాది బలగంతో దర్శకుడిగా మారి ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన కమెడియన్ వేణు యెల్దండి నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడనే దాని మీద ఇప్పటిదాకా అధికారిక స్పష్టత లేదు. న్యాచురల్ నానికి చెప్పిన కథ ఓకే అయ్యిందనే లీక్ తప్ప అఫీషియల్ గా దిల్ రాజు బృందం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అయితే ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా శిరీష్, హర్షిత్ తో కలిసి వేణు ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పడంతో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అర్థమైపోయింది. మాములుగా అయితే వీళిద్దరితో వేణు ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు.
వర్కింగ్ టైటిల్ గా ఎల్లమ్మని ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది. 80 దశకంలో ఒక మారుమూల పల్లెటూళ్ళో ప్రేమ, ఎమోషన్లు, కక్షలు, కార్పణ్యాలతో డిఫరెంట్ లైన్ సిద్ధం చేశారట. దసరా కూడా ఇలాంటి నేపధ్యమే అయినప్పటికీ వేణు తయారు చేసుకున్న సబ్జెక్టు వేరే ట్రీట్ మెంట్ తో ఉంటుందని వినికిడి. ఫైనల్ వెర్షన్ ఓకే కాగానే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సరిపోదా శనివారం మీదే దృష్టి పెట్టిన నాని దాని షూటింగ్ ని వేసవిలో పూర్తి చేసేసి వెంటనే డివివి బ్యానర్ లోనే సుజిత్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు.
తర్వాత లిస్టులో వేణుతో పాటు శ్రీకాంత్ ఓదెల ఉన్నాడు. త్రివిక్రమ్ పేరు వినిపించింది కానీ అదంతా వట్టి పుకారే. సో మిగిలిన ఇద్దరిలో ఎవరిది స్టార్ట్ చేయాలనే దాని మీద ఇంకా కసరత్తు జరగాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఓజికి ఎన్నికలు అయ్యాక కాల్ షీట్స్ ఇవ్వగానే దాన్ని పూర్తి చేసి సుజిత్ ఫ్రీ అయిపోతాడు. ఒకవేళ మరీ లేట్ అవుతుందనుకుంటే హరీష్ శంకర్ లాగా ఇంకో సినిమాని పూర్తి చేయొచ్చు. కానీ పవన్ మాత్రం ప్రాధాన్యం పరంగా ఓజికి స్పష్టమైన హామీ ఇచ్చాడు కాబట్టి డౌట్ లేదు. ఇక శ్రీకాంత్ ఓదెల స్టోరీ రెడీ కాగానే నానిని కలిసే ప్లాన్ లో ఉన్నాడు. చూడాలి మరి ఎవరు ముందుంటారో.
This post was last modified on February 24, 2024 7:11 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…