భీష్మ సినిమాతో తన ఫ్లాపుల హ్యాట్రిక్‍ని మరపించిన దర్శకుడు వెంకీ కుడుములకు నితిన్ ప్రేమతో రేంజ్ రోవర్ కార్ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. బర్త్ డే గిఫ్ట్ గా కేవలం ఖరీదయిన కారే కాదు… మరో కోటి రూపాయల చెక్కు కూడా ఇచ్చాడని ఇన్‍సైడ్ టాకు. డబ్బులెందుకు ఇచ్చాడా అనుకుంటున్నారా? కార్ కీ ఇవ్వడంతో పాటు కుడుములని ఒక ప్రాజెక్ట్ కోసం నితిన్ లాక్ చేసేసాడట. ఈసారి వీరిద్దరి కాంబినేషన్‍లో వచ్చే చిత్రాన్ని నితిన్ తన సొంత బ్యానర్‍పై నిర్మిస్తాడట.
కానీ ఈ సినిమా మొదలు కావడానికి కాస్త సమయం పడుతుంది. నితిన్‍కి రంగ్‍దే కాకుండా మరో మూడు సినిమాలు లైన్లో వున్నాయి. అలాగే వెంకీ కుడుముల తన తదుపరి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ కోసం చేయాల్సి వుంది. వెంకీ కుడుముల సినిమా కోసం స్టార్ హీరోలను అప్రోచ్ అయ్యే పనిలో మైత్రి మూవీస్ బిజీగా వుంది. మైత్రి తరఫున ఇంతకుముందే చరణ్‍ను, ఆ తర్వాత మహేష్‍ను కలిసి కుడుముల లైన్ వినిపించాడనే ప్రచారం జరిగింది. ఎంత పెద్ద స్టార్‍తో చేసినా కానీ కుడుముల మళ్లీ నితిన్‍తో అయితే సినిమా చేసి తీరాలన్నమాట. భీష్ముడు భలేగా లాక్ చేసాడు కదూ!
This post was last modified on September 9, 2020 10:30 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…