పవన్‍కళ్యాణ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో లుక్ చూస్తేనే షూటింగ్ చేసే మూడ్‍లో అస్సలు లేడనే సంగతి తెలిసిపోతుంది. కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోండగా షూటింగ్ చేయడానికి పవన్ సుముఖంగా లేడు. అందుకే మిగతా సినిమాల షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నా పవన్ మాత్రం ఇంకా రిలాక్స్ మూడ్‍లోనే వున్నాడు. ఇదిలావుంటే వకీల్‍సాబ్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
కాకపోతే పవన్‍కళ్యాణ్ లేని పోర్షన్ అంతా ఈ షెడ్యూల్‍లో పూర్తి చేయనున్నారు. పవన్ వచ్చిన తర్వాత మిగతా షూటింగ్ చేస్తారు. పింక్ రీమేక్ కనుక ఈ చిత్రంలో పవన్ పాత్ర నిడివి ఎంతనేది మీకు ఈపాటికి ఒక ఐడియా వుండే వుంటుంది. అందుకే పవన్ మళ్లీ సెట్స్ కి వచ్చిన తర్వాత ఎక్కువ డిలే లేకుండా మిగతా భాగమంతా షూట్ చేసి, ఎడిటింగ్, రీరికార్డింగ్ కూడా చేసేసి పెట్టుకోవాలని వకీల్‍సాబ్ టీమ్ డిసైడ్ అయింది.
పవన్ నవంబర్ నుంచి షూటింగ్‍కి రావచ్చునని వినిపిస్తోన్న నేపథ్యంలో ఒకవేళ అప్పటికి నిజంగా పవన్ అందుబాటులోకి వస్తే సంక్రాంతికి విడుదల చేసుకునేలా వకీల్ సాబ్ బృందం ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఒకవేళ నవంబర్‍కి కూడా పవన్ రానట్టయితే ఇక ఈ చిత్రం విడుదలయ్యేది వేసవిలోనే. ఈ చిత్రం ఓటిటి విడుదల కోసం మంతనాలు జరుగుతున్నాయనే దాంట్లో వాస్తవం లేదని తెలిసింది.
This post was last modified on September 9, 2020 10:08 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…