తెలుగులో ఒకప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవాడు బెల్లంకొండ శ్రీనివాస్. తండ్రి బెల్లంకొండ సురేష్ అండతో పెద్ద పెద్ద బడ్జెట్లలో, పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేశాడు కెరీర్ ఆరంభంలో. కానీ ఈ మధ్య అతడి జోరు బాగా తగ్గిపోయింది. ఛత్రపతి హిందీ రీమేక్ కోసం కొన్నేళ్లు కష్టపడితే అది కనీస ప్రభావం కూడా చూపలేదు.
ఇప్పుడతను ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ చంద్రతో ‘టైసన్ నాయుడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పనిలో శ్రీనివాస్ బిజీగా ఉండగా.. అతడి పాత సినిమా ఒకటి సంచలన రికార్డును సొంతం చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ చిత్రం మరేదో కాదు.. జయ జానకి నాయక. దీని హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సినిమాగా వరల్డ్ రికార్డు నెలకొల్పడం విశేషం.
గత కొన్నేళ్లలో అనేక తెలుగు చిత్రాలను హిందీలో అనువాదం చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. గోల్డ్ మైన్ ఫిలిమ్స్, పెన్ మూవీస్ లాంటి సంస్థలకు ఇది మంచి ఆదాయ వనరుగా మారింది. తెలుగులో ఫలితంతో సంబంధం లేకుండా అనువాద చిత్రాలు యూట్యూబ్‌లో అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన మాస్ సినిమాలన్నీ అక్కడ భారీగా వ్యూస్ తెచ్చుకున్నాయి.
‘జయ జానకి నాయక’ అయితే ఏకంగా 800 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించడం విశేషం. ఇండియానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఏ సినిమాకూ యూట్యూబ్‌లో ఇన్ని వ్యూస్ రాలేదట. ఇది వరల్డ్ రికార్డ్ అంటూ పెన్ మూవీస్ ట్విట్టర్లో ప్రకటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ 2017లో విడుదలై ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. అలాంటి సినిమాకు హిందీలో ఈ స్థాయిలో వ్యూస్ రావడం అనూహ్యం.
This post was last modified on February 21, 2024 5:00 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…