Movie News

కల్కి మాట మారిస్తే చాలా ఇబ్బంది

ప్రభాస్, దర్శకుడు నాగ అశ్విన్ కలయికలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి మే 9 విడుదలని టీమ్ ప్రమోట్ చేసుకుంటూ వస్తోంది. షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది కానీ చేతిలో ఎనభై రోజుల వ్యవధిలో వర్క్ మొత్తం ఫినిష్ చేయగలరా లేదానే దాని మీద ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. వైజయంతి మూవీస్ అదే డేట్ కి రావాలని సెంటిమెంట్ గా ఫీలవుతోంది. తమ బ్యానర్ లోని ఐకానిక్ మూవీస్ మహానటి, జగదేకవీరుడు అతిలోకసుందరి ఆ రోజు వచ్చే బ్లాక్ బస్టర్లయ్యాయి. పైగా ఇది ఆ సంస్థకు యాభై వార్షికోత్సవం. ఇలా అన్ని లెక్కేసుకునే మే 9 లాక్ చేసుకున్నారు.

తీరా చూస్తే మళ్ళీ వాయిదా ఊహాగానాలు మొదలైపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇది వస్తుందని తెలిసే మే 9 ఎవరూ షెడ్యూల్ చేసుకోలేదు. బాలీవుడ్ లోనూ రిస్క్ ఎందుకు లెమ్మని ఈ తేదీకి దూరంగా ఉన్నారు. సలార్ ని ఢీ కొని షారుఖ్ ఖాన్ అంతటివాడే దెబ్బ తిన్నాక ఎవరు మాత్రం ఎందుకు సాహసం చేస్తారు. కానీ ఇప్పుడు కల్కి కనక తప్పుకుంటే ఇతర ప్రొడ్యూసర్లు టెన్షన్ పడటం ఖాయం. ఎందుకంటే గతంలో సలార్ టైంలోనూ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కు మార్చినప్పుడు వేరే నిర్మాతలు బాగా నష్టపోయారు. ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలు.

ఇప్పుడు కల్కి అదే బాట పడితే మాత్రం మరోసారి తలనెప్పులు ఖాయం. టీమ్ మాత్రం అబ్బే అదేం లేదు మే 9 ఎలాంటి మార్పు లేదని అఫ్ ది రికార్డు చెబుతోంది. ఇతర దర్శకుల్లా ఏదైనా అడుగుదామంటే నాగ అశ్విన్ బయట అంత సులభంగా దొరకడం లేదు. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ విఎఫెక్స్ పనుల్లో ఇంకా బెస్ట్ క్వాలిటీని అతను డిమాండ్ చేయడంతో మళ్ళీ మళ్ళీ వర్క్ జరుగుతోందని వినిపిస్తోంది. సో వీలైనంత త్వరగా కీలక ప్రకటన ఇస్తే బాగుంటుంది. రాజమౌళి తరహాలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి క్లారిటీ ఇచ్చేస్తే ఏ గోలా ఉండదు. లేదూ సలార్ లాగా అన్నీ చెప్పకుండా చేస్తాం అంటే ఎవరైనా ఏం చేయగలరు.

This post was last modified on February 21, 2024 4:51 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago