ఈ రోజుల్లో సినిమా ఒరిజినల్ రిజల్ట్ ఏంటో తెలియాలంటే వీకెండ్ అయ్యేవరకు ఎదురు చూడాలి. ముందస్తు హైప్ ఉన్న సినిమాలు వీకెండ్ వరకు బాగానే పెర్ఫామ్ చేస్తాయి. కానీ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకుంటే వీకెండ్ అవ్వగానే వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయిపోతాయి. ఫిబ్రవరిలో సినిమాలన్నింటి పరిస్థితి ఇలాగే ఉంది.
తొలి వారంలో వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, రెండో వారంలో రిలీజైన ఈగల్ సినిమాలు వీకెండ్ వరకు బాగానే పెర్ఫామ్ చేశాయి. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ‘ఈగల్’ పరిస్థితి అయితే వారం తిరిగేసరికి చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఇక గత వీకెండ్లో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ డివైడ్ టాక్ తట్టుకుని తొలి వీకెండ్లో బాగానే పెర్ఫామ్ చేసింది.
కానీ సోమవారం ‘భైరవకోన’ కలెక్షన్లలో బాగా డ్రాప్ కనిపించింది. వీక్ డేస్‌లో మార్నింగ్ షోలు, మ్యాట్నీలకు థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈవెనింగ్, నైట్ షోలకు కూడా వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కలెక్షన్లు పెద్దగా పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. మిడ్ వీక్‌కు వచ్చేసరికి అసలు సౌండ్ లేదు. ఈ సినిమా గురించి జనాలు పెద్దగా మాట్లాడుకోవడం లేదు. సోషల్ మీడియాలో కూడా హడావుడి బాగా తగ్గిపోయింది.
ప్రేక్షకుల ఫోకస్ కొత్త సినిమాల మీదికి మళ్లుతోంది. అలా అని ఈ వారం పేరున్న సినిమాలేవీ రావట్లేదు. అన్నీ చిన్న స్థాయివే. సిద్దార్థ రాయ్, సుందరం మాస్టార్, మస్త్ షేడ్స్ ఉన్నాయ్‌లకు తోడు భ్రమయుగం అనే డబ్బింగ్ మూవీ బాక్సాఫీస్ దండయాత్రకు వస్తున్నాయి. మరి వీటి ప్రభావాన్ని తట్టుకుని ‘ఊరు పేరు భైరవకోన’ వీకెండ్లో ఏమాత్రం సత్తా చాటుతుందో చూడాలి.
This post was last modified on February 21, 2024 4:48 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…