గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. గత ఏడాది తరుణ్ భాస్కర్ నుంచి వచ్చిన ‘కీడా కోలా’ సినిమాలో బాలు గాత్రాన్ని ఏఐ ద్వారా రీక్రియేట్ చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించాడు. తరుణ్ భాస్కర్ అండ్ కోకు ఆయన ఈమేరకు లీగల్ నోటీసులు పంపించారు. అనుమతి లేకుండా బాలు వాయిస్‌ను వాడుకున్నందుకు క్షమాపణ చెప్పడంతో పాటు రాయల్టీ కింద కోటి రూపాయలు చెల్లించాలని కీడా కోలా టీంకు చరణ్ లాయర్ నోటీసులు పంపించాడు.
ఐతే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అనుమతి లేకుండా బాలు వాయిస్ వాడుకోవడం తప్పు కదా అని తరుణ్ భాస్కర్‌ను తప్పుబడుతుంటే.. ఇంకొందరు చరణ్ ఇంత తీవ్రంగా స్పందించాలా అని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
కొన్నేళ్ల కిందట బాలు-ఇళయరాజా మధ్య నడిచిన వివాదం గుర్తుండే ఉంటుంది. సంగీత విభావరుల్లో తన పాటలు వాడుకుంటున్నందుకు రాయల్టీ ఇవ్వాలంటూ బాలుకు ఇళయరాజా నోటీసులు ఇవ్వడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇందులో బాలు ఎంతో ఆవేదన చెందారు. తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఆ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. ‘కీడా కోలా’ టీం బాలు మీద గౌరవంతోనే ఆయన వాయిస్‌ను ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఉండొచ్చని.. అందుకు లాయర్ నోటీసులు ఇచ్చి, కోటి రూపాయల పరిహారం కోరడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అనుమతి లేకుండా బాలు వాయిస్ వాడుకోవడం తప్పే కావచ్చు కానీ.. దానికి వార్నింగ్‌తో సరిపెట్టాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఐతే ‘కీడా కోలా’ టీంను చూసి మిగతా వాళ్లు కూడా ఏఐ సాయంతో బాలు వాయిస్‌ను వాడుకుంటూ పోతే అది బ్యాడ్ ట్రెండుకు దారి తీస్తుందని.. ఇంకెవరూ ఇలా చేయకుండా హెచ్చరించడానికే ఎస్పీ చరణ్ నోటీసుల వరకు వెళ్లి ఉండొచ్చని.. తరుణ్ భాస్కర్ చరణ్‌తో మాట్లాడితే మొత్తం సర్దుకుంటుందని భావిస్తున్నారు.
This post was last modified on February 21, 2024 2:26 pm
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…
వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల అసహనానికి గురైన వా వాతియర్ (అన్నగారు వస్తారు) ఎట్టకేలకు విడుదలకు రెడీ అయ్యింది. జనవరి…