ఎల్లుండి విడుదల కాబోతున్న కొత్త సినిమాల్లో సిద్దార్థ్ రాయ్ ఒకటి. అతడు, భద్ర లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో చైల్డ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న దీపక్ సరోజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. యశస్వి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. నిర్మాణంలోనూ భాగస్వామ్యముంది. ప్రమోషన్లు గట్రా బానే చేస్తున్నారు. అయితే ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈ సిద్దార్థ్ రాయ్ లో అర్జున్ రెడ్డి ఛాయలు ఎక్కువగా ఉన్నాయనే కామెంట్లు వినిపించాయి. హీరో క్యారెక్టరైజేషన్, విపరీత ప్రవర్తన, ప్రేమ సంబంధాల విషయంలో చూపించే తీవ్రత చాలా దగ్గరగా అనిపిస్తోంది.
ఒకరకంగా ఇదే ఇదే కొంత మైనస్ అవుతోంది. ఎందుకంటే దీపక్ కు ఎలాంటి ఇమేజ్ లేదు. డెబ్యూతోనే ఇంత అగ్రెసివ్ క్యారెక్టర్ చేయడం చిన్న విషయం కాదు. కానీ యశస్వి మాత్రం ఇందులో యూత్ కి చాలా బలమైన సందేశం ఇస్తున్నామని, మొత్తం చూశాక మీకే అర్థమవుతుందని అంటున్నారు. హీరో హీరోయిన్ మధ్య లిప్ లాక్ సన్నివేశాల కోసమే మూడు రోజులు వర్క్ షాప్ నిర్వహించానని చెప్పడం గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపించింది. కంటెంట్ మాట్లాడాలి కానీ ఇలా కిస్సుల గురించి గొప్పగా చెప్పుకోవడం ఏమిటని అన్నవాళ్ళు లేకపోలేదు.
ఇప్పుడు సిద్దార్థ్ రాయ్ భుజాల మీద పెద్ద బరువుంది. అర్జున్ రెడ్డి ముద్ర ఏమి లేదని, ఇది పూర్తిగా కొత్త కథా కథనాలతో రూపొందిందననే టాక్ టాక్ బయటికి రావడం. లేదూ అంటే లేనిపోని ట్రోలింగ్ కి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అసలే ఇతర చిన్న సినిమాలతో పోటీ తీవ్రంగా ఉంది. సుందరం మాస్టర్, మస్త్ షేడ్స్ ఉన్నాయిరాలు కామెడీని నమ్ముకుని దిగుతున్నాయి. మమ్ముట్టి భ్రమ యుగంకి సితార మంచి రిలీజ్ దక్కేలా చేస్తోంది. వ్యూహం మీద ఆశలేం లేకపోయినా కొన్ని స్క్రీన్లు అట్టిపెట్టుకుంటుంది. సో వీటి మధ్య నెగ్గుకురావడం సిద్దార్థ్ రాయ్ కు సులభంగా ఉండదు.
This post was last modified on February 21, 2024 5:05 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…