Movie News

బొమ్మరిల్లు జెనీలియా జంటది భలే తెలివి

ఇప్పుడు కనిపించడం మానేసింది కానీ బొమ్మరిల్లు టైంలో హీరోయిన్ జెనీలియాకు వచ్చిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బక్కపలచని దేహంతో ఉన్నా చలాకీతనం, ఆకట్టుకునే కళ్ళు, గలగలా మాట్లాడే నోరు తక్కువ టైంలో ఎక్కువ ఫ్యాన్స్ ని సంపాదించి పెట్టాయి. దెబ్బకు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ల సరసన జోడి కట్టేందుకు వెంటనే ఆఫర్లు వచ్చాయి. వాటిలో అధిక శాతం ఆశించిన విజయాలు సాధించకపోవడంతో క్రమంగా తెరమరుగై బాలీవుడ్ నటుడు రితీష్ దేశముఖ్ ని పెట్టుకుని హ్యాపీగా ముంబైకి మకాం మార్చేసింది.

కథ ఇక్కడితో అయిపోలేదు. మాములుగా గృహిణిగా మారాక ఆర్టిస్టులు సపోర్టింగ్ రోల్స్ కి మారిపోతారు. పైగా రితీష్ కూడా డిమాండ్ తగ్గిపోయిన హీరో. సహజంగానే ఇతర వ్యాపకాల మీద దృష్టి పెడతారు. కానీ ఈ జంట అలా ఆలోచించలేదు. నాగచైతన్య సమంత మజిలీ రీమేక్ రైట్స్ కొనుక్కుని రెండు సంవత్సరాల క్రితం మరాఠిలో వేద్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ సాధించారు. రితీష్ హీరోగా నటించడంతో పాటు స్వయంగా తొలి దర్శకత్వం కూడా చేశాడు. వంద కోట్ల వసూళ్లు దాటేశాయి. కట్ చేస్తే ఇప్పుడు అతని డైరెక్షన్ లోనే భారీ బడ్జెట్ తో రాజా శివాజీని తెరకెక్కిస్తున్నారు.

నిన్న అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా అయిపోయింది. చూస్తుంటే భార్యాభర్తల తెలివైన ప్లానింగ్ కి సూపర్ అనకుండా ఉండలేం. కెరీర్ లో తనకో గుర్తింపునిచ్చిన టాలీవుడ్ నుంచే తన భర్త డెబ్యూకి కావాల్సిన సినిమాను వెతుక్కోవడం దగ్గరే జెనీలియా చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది. మజిలీని హిందీలోనే తీయొచ్చు. అలాంటివి అక్కడ చాలా వచ్చాయి. కానీ మరాఠిని ఎంచుకోవడం ద్వారా అద్భుత ఫలితం దక్కింది. మహారాష్ట్రలో శివాజీకున్న ఆరాధనాభావం గురించి అందరికీ తెలిసిందే. ఏకంగా జియో స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉండటమంటే మాటలా.

This post was last modified on February 20, 2024 4:27 pm

Share

Recent Posts

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

38 minutes ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

48 minutes ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

1 hour ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

1 hour ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

2 hours ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

4 hours ago