Movie News

కల్కిపై ఎవరికీ నమ్మకాల్లేవ్

ఈ ఏడాది వేసవికి భారీ చిత్రాల మోత మోగిపోతుందని ఆశించారు అభిమానులు. కానీ ఈ సీజన్లో వస్తుందనుకున్న ఒక్కో పెద్ద సినిమా వాయిదా పడిపోతోంది. అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప-2’ను చాన్నాళ్ల ముందే వేసవి రేసు నుంచి తప్పించారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా ద్వితీయార్ధానికి వెళ్లిపోయింది. ఇక ఏప్రిల్ 5కి రిలీజ్ డేట్ ఖరారు చేసుకుని ఆ దిశగా అడుగులు వేసిన ‘దేవర’ను సైతం వేసవి బరి నుంచి తప్పించి అక్టోబరు 10కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక వేసవిలో చివరి ఆశ ‘కల్కి’ మీదే ఉంది. ఈ ఒక్క భారీ చిత్రం వస్తే.. మిగతా పెద్ద సినిమాలు లేని లోటు అంతగా తెలియదని అనుకున్నారు. కానీ డేట్ దగ్గరపడేకొద్దీ నమ్మకం సడలిపోతోంది. చిత్ర బృందం నేరుగా వాయిదా సంకేతాలు ఏమీ ఇవ్వకపోయినా.. మే 9న ‘కల్కి’ వస్తుందనే నమ్మకం కలగట్లేదు.

‘కల్కి’ ఆషామాషీ సినిమా కాదు. హాలీవుడ్ రేంజిలో తెరకెక్కుతోంది. బహు భాషల్లో రిలీజ్ చేయాలి. ఈపాటికి షూట్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఒక కొలిక్కి తెచ్చేసి ఉండాలి. కానీ ఇంకా షూట్ ముగిసినట్లు అనిపించడం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ పనులు వేర్వేరు దేశాల్లో జరుగుతున్నాయి. ఈ టైంలోకి ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టి ఆన్ లైన్లో సందడి చేస్తుండాలి.

రాజమౌళి సినిమాల రేంజిలో దీనికి పబ్లిసిటీ చేయాల్సి ఉంది. ఆయన రిలీజ్ దగ్గర పడే సమయానికి ఎలా సినిమాను వార్తల్లో నిలబెడతారో చూడాలి. జక్కన్న సినిమాల స్కేల్ ఉన్నప్పటికీ.. ‘కల్కి’ గురించి ప్రస్తుతం ఎలాంటి సౌండ్ లేదు. నిజంగా మే 9న సినిమాను రిలీజ్ చేసేట్లయితే చిత్ర బృందం కచ్చితంగా హాడావుడి చేసేది. రిలీజ్ కౌంట్ డౌన్ కూడా నడిపేది. కానీ అందరూ సైలెంట్‌గా ఉన్నారంటే సినిమా వాయిదా పడబోతోందనే అర్థం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on February 20, 2024 10:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

43 minutes ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

50 minutes ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

2 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

2 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

3 hours ago