సౌత్ దర్శకుల్లో మోస్ట్ టాలెంటెడ్ గా కీర్తింబపడే లోకేష్ కనగరాజ్ కు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఖైదీ, విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ వెనుక ప్రధాన కారణంగా నిలిచింది వీళ్ళే. లియో యావరేజ్ గా ఉన్నా ఏపీ తెలంగాణలో లాభాలు తేవడానికి కారణం విజయ్ కు పెరిగిన మార్కెట్. అయితే లోకేష్ క్రియేటివిటీ మీద ఎప్పటికప్పుడు మూవీ లవర్స్ మధ్య చర్చలు జరుగుతూనే ఉంటాయి. అతనివి స్వంత కథలు కావని, పాత వాటి నుంచి స్ఫూర్తి పొంది ట్రెండ్ కు అనుకూలంగా మార్చుకుని హిట్లు కొడతాడని అంటారు. కాస్త ఆలస్యంగా అయినా సరే లోకేష్ కాపీ ముద్ర ఒకటి స్పష్టంగా బయటపడింది.
మూడేళ్ళ క్రితం 2021లో వచ్చిన మాస్టర్ గుర్తుందిగా. విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మంచి రికార్డులు సృష్టించింది. దీనికి మూలం 1989 మలయాళంలో వచ్చిన ముద్ర. అందులో మమ్ముట్టి హీరో. బాల నేరస్థులు ఉండే ఒక జైలుకి హీరో సూపర్ వైజర్ గా వస్తాడు. అక్కడి పిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళతో స్థానిక ముఠాలు అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నాయని గుర్తిస్తాడు. ఈ క్రమంలో ఓ కుర్రాడు చనిపోతాడు. ఆ నేరం ఇతని మీద మోపేందుకు చూస్తారు. జైలు సెటప్, జువైనల్ హోమ్ ముద్రలో లాగా మాస్టర్ లో ఇదే తరహాలో ఉంటుంది.
చాలా సీన్లు మక్కీకి మక్కి దింపేశాడు లోకేష్. రెండు వీడియోలను పక్కపక్కన పెట్టి ట్యాలీ చేస్తూ మరీ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ముద్ర మీద అవగాహన లేని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆ మాట కొస్తే చిరంజీవి మాస్టర్ షేడ్స్ కొన్ని లోకేష్ తీసిన మాస్టర్ లోనూ ఉంటాయి. సరే స్ఫూర్తి పొందటం తప్పేమి కాదు కానీ ఇలా మరీ సన్నివేశాలన్నీ ఎత్తుకొచ్చి కొత్త సృష్టిలాగా చెప్పుకోవడం ఏమిటనేది నెటిజెన్ల కంప్లయింట్. సక్సెస్ ముందు ఇవన్నీ ఎవరైనా పట్టించుకుంటారా. ప్రస్తుతం రజనీకాంత్ కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో లోకేష్ కనగరాజ్ బిజీగా ఉన్నాడు.
This post was last modified on February 19, 2024 11:14 am
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…