హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రూపొంది మలయాళంలో సెన్సేషనల్ హిట్ సాధించిన ప్రేమలు చూసిన వాళ్ళందరూ దాని ప్రేమలో పడుతున్నారు. చాలా సింపుల్ లవ్ స్టోరీని మన నేటివిటీలో సున్నితమైన ఆరోగ్యకరమైన హాస్యంతో దర్శకుడు గిరీష్ ఏడి రూపొందించిన తీరు చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. భాగ్యనగరంలో లిమిటెడ్ షోలు వేస్తే దాదాపుగా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. షో టైంకి కౌంటర్ దగ్గరికి వెళ్తే టికెట్లు లేవంటున్నారు. మమ్ముట్టి భ్రమ యుగంకి వచ్చిన పాజిటివ్ టాక్ ని తట్టుకుని ప్రేమలుకి ఇంత ఆదరణ దక్కడం మాములు విశేషం కాదు.
ఇప్పుడీ క్యూట్ లవ్ స్టోరీ మీద మన నిర్మాతల కళ్ళు పడ్డాయి. డబ్బింగ్ చేయాలా లేక రీమేక్ కు వెళదామా అనే ఆలోచనలో పలు నిర్మాణ సంస్థలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయట. గతంలో ఇలా ఇతర భాషల్లో కల్ట్ క్లాసిక్స్ అనిపించుకున్నవి మన దగ్గర అదే ఫలితాన్ని రిపీట్ చేయలేదు. 96ని దిల్ రాజు ముచ్చటపడి కొనుక్కుని శర్వా సమంతాలతో జానుగా తీస్తే డిజాస్టరయ్యింది. ప్రేమమ్ ని నాగచైతన్యతో చేస్తే జస్ట్ హిట్ అనిపించుకుంది తప్ప ఒరిజినల్ లాగా ట్రెండ్ సెట్టర్ కాలేదు. కాబట్టి అన్ని రకాల క్యాలికులేషన్లు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.
అధిక శాతం వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రకారం ప్రేమలుని డబ్బింగ్ చేస్తేనే సేఫ్ గేమ్ అవుతుంది. అందులో ఉన్న ఫ్రెష్ క్యాస్టింగ్ ని తిరిగి అదే రేంజ్ లో ఇక్కడ సెట్ చేసుకోవడం అంత సులభం కాదు. పోనీ వాళ్ళతోనే తీద్దామంటే అనవసరంగా బడ్జెట్ ఖర్చు. అందుకే అనువాదమైతే ఏ రిస్క్ ఉండదు. ఇటీవలే ఎస్కెఎన్ మారుతీలు కలిసి ఎంతో ముచ్చటపడి ట్రూ లవర్ ని తెచ్చారు. వర్కౌట్ కాకపోయినా నష్టం శాతం తక్కువ. కానీ ప్రేమలుకి అలాంటి ప్రమాదం లేదు. మన యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ పుష్కలంగా ఉంది. లవ్ టుడే లాగా లాభాలు ఖాయం. కాకపోతే లేట్ చేయకూడదు.
This post was last modified on February 18, 2024 2:24 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…