ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘పుష్ప-2’ ఒకటి. రెండేళ్ల కిందట పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించిన ‘పుష్ప’కు కొనసాగింపుగా అల్లు అర్జున్-పుష్ప చేస్తున్న చిత్రమిది. ఫస్ట్ పార్ట్ డివైడ్ టాక్‌ను తట్టుకుని బ్లాక్‌బస్టర్ కావడంతో రెండో భాగం మీద సుక్కు అండ్ టీం మామూలు కసరత్తు చేయట్లేదు. చాలా టైం తీసుకుని స్క్రిప్టు రెడీ చేశారు. షూటింగ్ కోసం కూడా చాలా టైం తీసుకుంటున్నారు. ఆగస్టు 15కు ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ సినిమా మేకింగ్ టైంలోనే ‘పుష్ప-3’ గురించి ఊహాగానాలు వినిపించాయి. మూడో భాగానికి స్కోప్ ఉండేలా చివర్లో ఓపెన్ ఎండింగ్ పెడతారని వార్తలు వచ్చాయి. ఐతే ‘పుష్ప’ కోసం ఇప్పటికే ఐదేళ్ల దాకా సమయం పెట్టాడు అల్లు అర్జున్. మళ్లీ ఇంకో రెండు మూడేళ్లు ఇదే కథ కోసం పెడతాడా.. అయినా ఇంకో పార్ట్ తీస్తే కథను సాగదీసినట్లు అనిపించదా అన్న సందేహాలు తలెత్తాయి.
ఐతే ఇప్పుడు స్వయంగా అల్లు అర్జునే ‘పుష్ప-3’ గురించి మాట్లాడాడు. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు అతిథిగా హాజరై ‘పుష్ప-2’ను ప్రమోట్ చేస్తున్న బన్నీ.. అక్కడ పార్ట్-3 గురించి హింట్ ఇచ్చాడు. ‘పుష్పను మేం ఫ్రాంఛైజీగా మార్చాలని అనుకుంటున్నాం. లైనప్ కోసం మా దగ్గర కొన్ని అద్భుతమైన ఆలోచనలున్నాయి. కాబట్టి మీరు కచ్చితంగా పుష్ప-3ని ఆశించవచ్చు’’ అని బన్నీ చెప్పాడు.
ఇక ‘పుష్ప-2’ గురించి బన్నీ మాట్లాడుతూ.. “తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటాయి. పుష్పరాజ్ పాత్ర చిత్రణ.. సినిమా స్కేల్, ప్రెజెంటేషన్ అన్నీ భారీగా ఉంటాయి. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది” అని బన్నీ చెప్పాడు. ‘పుష్ప-2’ తర్వాత తాను వరుసగా ఆసక్తికరమైన సినిమాలు చేయబోతున్నానని.. అవన్నీ భారీ స్థాయిలోనే ఉంటాయని బన్నీ తెలిపాడు.
This post was last modified on February 18, 2024 1:29 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…