Movie News

సురేందర్ రెడ్డి.. సరెండర్‌ 2 సినిమా

టాలీవుడ్లో చాలామంది స్టార్ డైరెక్టర్లు నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్లే. చాలామంది పూర్తి స్థాయి నిర్మాతలుగా మారి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఐతే ఇప్పటి దర్శకులు అలా పూర్తిగా రిస్క్ తీసుకోవట్లేదు. తాము తీసే సినిమాల్లో భాగస్వామిగా మారి లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.

వాళ్లకున్న డిమాండ్‌ను బట్టి అది వర్కవుట్ అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమాల్లో నిర్మాతగా ఆయన పేరు పడదు కానీ.. అందులో ఆయన చేసే ప్రతి సినిమాకూ వాటా దక్కుతుంది. రాజమౌళి తీసే సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతుంది. సుకుమార్‌కు మైత్రీ సంస్థలో ఇలాగే వాటా దక్కుతోంది. ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా తొలిసారి ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాను బుధవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. ఐతే పోస్టర్ మీద ‘సరెండర్ 2 సినిమా’ అనే బేనర్ పేరును కూడా గమనించవచ్చు. ఇది సురేందర్‌కు సంబంధించిన సంస్థ కావడం విశేషం. సురేందర్ పేరు కలిసొచ్చేలా ఇంగ్లిష్‌లో surrende2cinema అని భలే పేరు పెట్టారు దీనికి. దీని ట్విట్టర్ హ్యాండిల్లోకి వెళ్లి చూస్తే ఈ సినిమా కోసమే కొత్తగా మొదలుపెట్టారన్నది స్పష్టం.

సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్.. ఈ దశలో అఖిల్‌తో సినిమా చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పారితోషకం బదులు పెట్టుబడి లేకుండానే లాభాల్లో మంచి వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. సురేందర్ రెడ్డి స్థాయిలోనే పెద్ద బడ్జెట్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో అక్కినేని వారు కోరుకుంటున్న మాస్ ఇమేజ్ అఖిల్‌కు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

This post was last modified on September 9, 2020 3:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భారత్ – పాక్: యుద్ధం జరిగితే ఐరాస ఏం చేస్తుంది?

భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి యుద్ధంగా మారితే, ఐక్యరాజ్య సమితి…

52 minutes ago

తొమ్మిదేళ్లకు దక్కిన ‘మెగా’ అవకాశం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది.…

1 hour ago

శ్రీవిష్ణు ‘సింగిల్’కు డబుల్ ఛాన్స్

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హీరో ఇమేజ్, మార్కెట్, క్యాస్టింగ్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది సింగిల్ కే.…

2 hours ago

కియారా… బేబీ బంప్‌తో మెగా గ్లామర్

కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…

3 hours ago

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్: టాప్-4లోకి వచ్చేదెవరు?

ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…

5 hours ago

స్వచ్ఛందంగా వెళ్లిపోతే 1000 డాలర్లు బహుమతి!

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…

7 hours ago