బాలీవుడ్లో చాలా తక్కువ సమయంలో గొప్ప నటుడిగా పేరు సంపాదించాడు నవాజుద్దీన్ సిద్దిఖి. ఆయన నట ప్రతిభ ఎలాంటిదో చెప్పడానికి గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా చాలా సినిమాలే ఉన్నాయి. నసీరుద్దీన్ షా, ఓంపురి, ఇర్ఫాన్ ఖాన్ లాంటి లెజెండ్స్ తర్వాత అంతటి విలక్షణ నటుడిగా నవాజ్‌కు పేరు వచ్చింది. దక్షిణాదిన కూడా అతడికి డిమాండ్ ఏర్పడింది.
ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా పేటలో అతణ్ని నటింపజేశాడు కార్తీక్ సుబ్బరాజ్. అంచనాలను అందుకోలేకపోయిన ఆ సినిమాలో నవాజ్ విలనీ బాగానే పేలింది. కానీ నవాజ్ మాత్రం ఆ సినిమా విషయంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడట. తన పాత్రకు తాను న్యాయం చేయలేదని.. అలా చేయకుండా పారితోషకం తీసుకున్నందుకు గిల్టీగా అనిపించిందని అతను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
పేట సినిమా చేసేటపుడు తనకు తమిళం ఒక్క ముక్క కూడా రాదని.. దీంతో ఆ సినిమాలో నటించడం చాలా ఇబ్బంది అయిందని నవాజ్ చెప్పాడు. భాష అర్థం కాకపోవడంతో డైలాగులు సరిగా చెప్పలేకపోయానని.. ఏదో అలా లిప్ సింక్ ఇస్తూ మేనేజ్ చేశానని.. సినిమా చూసుకున్నపుడు తనకే సంతృప్తిగా అనిపించలేదని నవాజ్ అభిప్రాయపడ్డాడు. తాను న్యాయం చేయని పాత్రకు పారితోషకం తీసుకోవడం ఇబ్బందిగా అనిపించిందని చెప్పాడు.
ఐతే మళ్లీ తాను సౌత్‌లో సైంధవ్ సినిమాలో నటించానని.. ఈ సినిమాకు ముందు మాత్రం తాను తెలుగు భాష నేర్చుకుని, డైలాగుల మీద పట్టు సాధించి, సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నానని.. ఆ విషయంలో తానెంతో సంతృప్తి చెందానని నవాజ్ తెలిపాడు. ఐతే నవాజ్‌కు సంతృప్తినివ్వకపోయినా, డబ్బిగ్ తేడా కొట్టినా పేటలో తన రోలే బాగుంటుంది. కానీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న సైంధవ్ సినిమా క్యారెక్టర్ మాత్రం మరీ నిరాశపరిచింది.
This post was last modified on February 16, 2024 10:10 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…